ఉర్కొండ : మండలంలోని ఉర్కొండ పేట పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న మినరల్ వాటర్ ప్లాంట్ ( Minaral Water plant) కు ఫౌండేషన్ సీఈవో సింగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ( Raghavendar Reddy) భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్న ధ్యేయంతో కొత్తగా బోర్వేసి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆంజనేయస్వామికి తన వంతు సేవ చేసుకొనే భాగ్యం దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఆలయం ఈవో సత్య చంద్రారెడ్డి , నిఖిల్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు.