ఊరూరా హోలీ వేడుకలు
చిన్నారులు కేరింతలు
ఉత్సాహంగా రంగుల పండుగ
వననర్తి టౌన్/రూరల్, మార్చి 29 : జిల్లా కేం ద్రంలో హోలీ పండుగను ఆనందాలతో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రాత్రి గాంధీచౌక్, పాతబజార్ తదితర ప్రాంతాల్లో కాముని దహనం నిర్వహించారు. ఉదయాన్నే చిన్నారులు, పెద్దలు రం గులు చల్లుకొని ఉత్సాహంగా పండుగను జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ, ఐజయ్య నగర్, నందిహిల్స్, జంగిడిపురం, సాగర్‌కాలనీ, భగీరథ కాలనీ, వల్లభ్‌నగర్, బండార్‌నగర్, రాంనగర్, పాతబజారు, గాంధీచౌక్, మర్రెమ్మకుంట, హరిజన్వాడ, రాజీవ్ చౌక్, నాగవరం, బాలనగర్ తదితర కాలనీల్లో ఆనందం గా, ఉత్సాహంగా హోలీ పండుగను నిర్వహించుకున్నారు. వనపర్తి మండలం కడుకుంట్ల, పెద్దగూడెం, సవాయిగూడెం, నాచహాళ్లీ, అంకూర్, చిట్యాల, చిమనగుంటపల్లి, చందాపూర్ గ్రామాల్లో ఆదివారం రాత్రి కాముని దహనం చేసి సోమవారం హోలీ పండుగను జరుపుకున్నారు.
పెబ్బేరులో..
పెబ్బేరు, మార్చి 29 : పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం యువత హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోలీ సందర్భంగా చిన్నారులు, యువత రంగుల్లో మునిగిపోయి కేరింతలు కొడుతూ ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో చిన్నారులు, యువకులు పాల్గొన్నారు.
పాన్గల్లో..
పాన్‌గల్/వీపనగండ్ల/పెద్దమందడి, మార్చి 29 : పాన్‌గల్, వీపనగండ్ల, పెద్దమందడి మండల కేంద్రాలతోపాటు ఆయా గ్రామాల్లో సోమవారం హోలీ వేడుకలను ప్రజలు నిరాడంబరంగా జరుపుకున్నారు. పాన్గల్లో ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో యువకులు ఉత్సాహంగా రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు బసంతం పూలతో అలంకరించిన కాముడిని తలపై ఎత్తుకొని పాటలు పాడు తూ ఇంటింటికీ తిరిగి జోజర సేకరించారు.
ఖిల్లాఘణపురంలో..
ఖిల్లాఘణపురం, మార్చి 29 : మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు సో మవారం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నా రు. బంధువులు, స్నేహితులు, విద్యార్థులు ఒకచోటికి చేరి ఆనందాలు, అపాయ్యతలు, అనురాగాలు పంచు తూ రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలను జరుపుకున్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, మార్చి 29 : మండల కేంద్రంలో హోలీ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. కనిమెట్టలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హోలీ సం బురాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆలకు ఎంపీపీ గుం తమౌనిక గులాబీ పువ్వు ఇచ్చి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌ డ్, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, కౌన్సిలర్ రవీందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రా ములుయాదవ్, రైతు సంఘం మండలాధ్యక్షుడు కొం డారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు అల్లాభాష, మాజీ వైస్ ఎం పీపీ మల్లేశ్, బాలరాజు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ప రమేశ్, రమేశ్, రాంచంద్రయ్యయాదవ్ పాల్గొన్నారు.