ఖిల్లాఘన్పూర్ : మండల పరిధిలోని సోలిపూర్ గ్రామం నుండి నూతలగుంటకు వెళ్లే గ్రామ పరిధిలోని బొంగు సీను అనే వ్యవసాయ పొలం దగ్గర భారీగా రేషన్ బియ్యం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సురేష్ గౌడ్ అక్కడికి చేరుకుని ప్రాథమిక విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 85 బ్యాగుల పిడిఎఫ్ రేషన్ బియ్యం పట్టుబడినట్లు తెలుస్తోంది. గత నెల రోజులుగా ఖిల్లాఘనపురం మండల పరిధిలో రైస్ మిల్లుకు రేషన్ బియ్యం సరాపర భారీగా జరుగుతున్నట్టు తెలు స్తుంది.
గతంలో కూడా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడిన కూడా అధికారులు తక్కువ మొత్తంలో పిడిఎఫ్ బియ్యం పట్టుబడినట్లు చూపించి కేసులు నమోదు చేశారు. గురువారం సాయంత్రం దాదాపు నాలుగున్నర టన్నుల బియ్యం పట్టుబడడం స్థానికంగా కలకలం రేపింది. గత నెల రోజులుగా పోలీసులు పౌరసరఫర అధికారులపై కేసులు నమోదు చేస్తున్నా అక్రమంగా బియ్యాన్ని రవాణా చేసే అక్రమార్కులు మాత్రం భయపడడం లేదు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.