Wanaparthy Municipality | వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో కౌన్సిలర్‌గా విజయం సాధించిన చీర్ల రజిని చందర్ తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి సార్ తనకు చైర్ పర్సన్ పదవి ఇస్తామని చెప్పి ఈ పదవిని అమ్ముకున్నాడని రజిని చందర్ ఆరోపించారు.
ఈ విషయమై రజిని చందర్ మీడియాతో మాట్లాడుతూ.. చైర్పర్సన్ మీరే అని ఎమ్మెల్యే మేఘారెడ్డి సార్ మాటిచ్చారు.. అందుకే నేను నామినేషన్ వేశాను. ఈ రోజు వేరేవాళ్లకు ఇచ్చేసరికి నేను కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి ఇచ్చేశాను. 22 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్లు గెలిచారు. దాంట్లో అగ్రకులాల వాళ్ల నుంచి ఉన్నది ఒకేఒక్కరు. ఆ ఒక్కరి కోసం 21 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు గెలుపొందారు. వాళ్లకొక అవకాశం ఇయ్యారా..? వనపర్తి అంటేనా బీసీలకు అడ్డాలెక్క ఉంటది.. అందరూ కలిసిమెలిసి ఉంటారు. అలాంటి వారికి కాదని మీరొక అగ్రవర్ణానికి కొమ్ముకాయడం.. అది కూడా డమ్మీ అభ్యర్థి మాధవి రమేశ్కిచ్చారు.. వారికి బర్త్ సర్టిఫికెట్ తెల్వది.. డెత్ సర్టిఫికెట్ తెల్వదు.. మున్సిపాలిటీ గురించి ఏం తెల్వని వాళ్లకు చైర్ పర్సన్ పదవి ఇవ్వడం దాని అర్థమేంది.. ? అని ఎమ్మెల్యే మేఘారెడ్డిని ప్రశ్నించారు.
టికెట్ ఇచ్చినప్పుడే చైర్మన్ అవకాశం ఇస్తేనే పోటీ చేస్తామని చెప్పామని, తీరా ఇప్పుడు మమ్మల్ని మోసం చేశారని రజిని చందర్ పేర్కొన్నారు. మాది మూడు తరాలుగా కాంగ్రెస్ కుటుంబం.. మా నమ్మకాన్ని పార్టీ వమ్ముచేసింది, అందుకే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నామన్నారు.
వనపర్తి మున్సిపాలిటీలో ముసలం
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్ చీర్ల రజిని చందర్
చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే మేఘా కృష్ణారెడ్డి అమ్ముకున్నాడని రజిని చందర్ ఆరోపణలు
టికెట్ ఇచ్చినప్పుడే చైర్మన్ అవకాశం ఇస్తేనే పోటీ చేస్తామని చెప్పామని, తీరా ఇప్పుడు మమ్మల్ని… pic.twitter.com/6x3GGp3tZ6
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2026