
రాజాపూర్, ఆగస్టు 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడు అని మాజీ ఎంపీపీ నర్సింహులు అన్నారు. హుజూరాబాద్‌లో సో మవారం చేపట్టిన దళితబంధు పథకం ప్రా రంభోత్సవ సభకు రాజాపూర్ మండలం నుంచి భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబంధు పథకంతో దళితులు ఆర్థికంగా రాణిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దళితులకు మంచి రోజులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, విజయ్, నర్సింహులు, శేఖర్, నాగరాజు, జంగయ్య, నర్సింహులు, లక్ష్మయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సభకు స్వచ్ఛందంగా..
భూత్పూర్, ఆగస్టు 16 : హుజూరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభకు స్వచ్ఛందంగా తరలివెళ్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరింగ్ నర్సింహులు తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గం నుంచి హుజూరాబాద్‌కు దళిత నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ దళితబంధు పథకంతో దళితులు అన్నివిధాలా అభివృద్ధి చెందుతారని తె లిపారు. నియోజకవర్గం నుంచి స్వచ్చంధంగా దాదాపు వెయ్యిమంది దళితులు సభకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల, దేవరకద్ర, చిన్నచింతకుంట, కొత్తకోట, మదనాపురం మండలాల నుంచి వెళ్తున్న వాహనాలకు భూత్పూర్ చౌరస్తాలో బాదేపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్ జెండా ఊపి పంపించారు. కార్యక్రమంలో గాడి ల ప్రశాంత్, అయ్యన్న, గడ్డంరాములు, ప్రేమ్‌కుమార్, యాదయ్య, వెంకటయ్య, సర్పంచ్ వెంకటయ్య, సత్యనారాయణ, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘దళితబంధు’ దేశానికే ఆదర్శం
బాలానగర్, ఆగస్టు 16 : దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని టీఆర్ఎస్ ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి మల్లేశ్ అన్నారు. దళితబంధు సభకు మండలంలోని దళిత నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్, నేరళ్లపల్లి భూపాల్, సాయిలు, కృష్ణ, నర్సింహులు, పాండు తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలం నుంచి..
మిడ్జిల్, ఆగస్టు 16 : దళితబంధు సభకు టీఆర్ఎస్ నాయకులతో కలిసి దళిత సంఘాల నాయకులు తరలివెళ్లారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జం గారెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్, నాయకులు సుధాబాల్రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బాలస్వామి, బంగారు, భీంరాజు, చంద్రశేఖర్, శ్రీనివాసులు, జగదీశ్, సుకుమార్, విజయ్‌నాయక్, రవి, సురేశ్, మల్లేశ్, వెంకటేశ్, సైదులు, మల్ల య్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలం నుంచి..
నవాబ్‌పేట, ఆగస్టు 16 : హుజూరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన దళితబంధు పథకం ప్రా రంభోత్సవ సభకు మండలంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ దళిత నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. మండలకేంద్రం నుంచి ప్రత్యే క వాహనాల్లో వెళ్లి ముఖ్యమంత్రి సభలో పాల్గొన్నారు. తరలివెళ్లిన వారిలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీఎన్ రావు, మాజీ ఎంపీపీ శ్రీనయ్య, నాయకులు సత్యం, రాము లు, నారాయణ, వెంకటయ్య, శ్రీను, నర్సింహులు, నరేశ్, హన్మంతు, వీరేశ్ తదితరులు ఉన్నారు.
హన్వాడ మండలం నుంచి..
హన్వాడ, ఆగస్టు 16 : దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభకు మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో దళితులు అన్నివిధాలా అభివృద్ధి చెందుతారని తెలిపారు. కార్యక్రమంలో జంబులయ్య, నాగన్న, సుక్కయ్య, శ్రీను, యాదయ్య, మల్ల య్య, వాసు, గంగాపురి, ఆంజనేయులు, ఆనంద్, రాములు, అంజి పాల్గొన్నారు.
కోయిలకొండ మండలం నుంచి..
కోయిలకొండ, ఆగస్టు 16 : నారాయణపేట టీఆర్ఎస్ సమన్వయకర్త ఎస్ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కోయిలకొండ మండలం నుంచి హుజూరాబాద్‌కు టీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు బీ కృష్ణయ్య, నాయకులు భీంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్యయాదవ్, రాజవర్ధన్‌రెడ్డి, గురు శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ కృష్ణయ్య, ఎంపీటీసీ రవికిరణ్‌రెడ్డి, సర్పంచులు నారాయణయాదవ్, నారాయణరెడ్డి, అంజి, వడెన్న, వీరన్న పాల్గొన్నారు.
దళితుల సమగ్రాభివృద్ధి
దేవరకద్ర రూరల్, ఆగస్టు 16 : దళితబంధు పథకంతో దళితులు సమగ్రాభివృద్ధి సాధిస్తారని దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దొబ్బలి ఆంజనేయులు అన్నారు. దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల నుంచి దళిత నాయకులు, కార్యకర్తలు దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభకు తరలివెళ్లారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్, హన్మంతు, మొగులయ్య, ప్రభాకర్, కాంతారావు, యా కోబ్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలం నుంచి..
మూసాపేట, ఆగస్టు 16 : మండలంలోని వివిధ గ్రామాల నుంచి దళిత నాయకులు హుజూరాబాద్‌కు తరలివెళ్లారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, సర్పంచులు స్వరూప, లక్ష్మణ్, బాబమ్మ, శ్రీహరి, వెంకట్రాములు, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, కొండయ్య, కోట్ల రవి పాల్గొన్నారు.
జడ్చర్ల మండలం నుంచి..
జడ్చర్ల, ఆగస్టు 16 : హుజూరాబాద్‌లో నిర్వహిస్తున్న దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభకు జడ్చర్లకు చెందిన టీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. దాదాపు 200మంది నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. దళితబంధు పథ కం ప్రారంభోత్సవం అనంతరం హుజూరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.