ఆత్మకూరు, జూలై 5 : హాస్టల్ ప్రాంగణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా ఎ స్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారిణి నుషిత పే ర్కొన్నారు. సోమవారం స్థానిక ఎస్సీ సంక్షేమ బా లికల వసతిగృహాన్ని సందర్శించిన ఆమె పరిసరాలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థులు లేని సమయంలోనే ఇలా ఉంటే వస్తే ఇంకెలా ఉం టుందోనని అసహనం వ్యక్తంచేశారు. ప్రాంగణం మొత్తంగా పచ్చదనంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హాస్టల్ ప్రాంతం లో హరితహారం మొక్కలు నాటి ప్రతి మొక్కనూ సంరక్షించాలని వార్డెన్ సుజాతను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్‌డబ్ల్యూవో మల్లేశ్, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత
ఖిల్లాఘణపురం, జూలై 5 : పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని ఎంపీడీవో విజయ్‌కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న పల్లెప్రగతి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల సుందరీకరణ కోసం పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని, గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాము లు కావాలన్నారు. అదేవిధంగా హ రితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో నాటిన ప్రతి మొ క్కనూ సంరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమం లో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి నాంది
వనపర్తి, జూలై 5 : పట్టణంలోని వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించడంతోపాటు వాటి ప రిష్కారానికి పట్టణప్రగతి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని ఆయా వార్డుల్లో సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుంది. పలు వార్డుల్లో వారు వేర్వేరుగా కమిషనర్ మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించా రు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు, కమిటీ సభ్యులు ఉన్నారు.
మదనాపురంలో..
మదనాపురం, జూలై 5 : గ్రామాలంటే గతంలో పేరుకుపోయిన చెత్త, అస్తవ్యస్తమైన రహదారులు, రోడ్లపై పారుతున్న మురుగు కాలువలు దర్శమిచ్చేవని, టీఆర్ఎస్ ప్ర భుత్వం వచ్చిన తరువాత గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని ఎంపీ పీ పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎంపీపీ పద్మావతి, అజ్జకొల్లు గ్రామంలో జెడ్పీటీసీ కృష్ణయ్య హాజరై శ్రమదానం చేసి ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములైతే, మండలం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ నారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు రాంనారాయణ, బ్రహ్మమ్మ, ఉపసర్పంచ్ అనిత, వార్డు సభ్యురాలు రాజేశ్వరీ, మార్కెట్ డైరెక్టర్ వెంకటేశ్‌యాదవ్, నాయకులు అశోక్‌యాదవ్, కృష్ణ, పంచాయతీ సెక్రటరీ రంగస్వామి పాల్గొన్నారు.
పారిశుధ్య కల్పనకు కృషి చేయాలి
పాన్‌గల్, జూలై 5 : గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంత రం కృషి చేయాలని ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి అ న్నారు. మండలకేంద్రంతోపాటు మాందాపూర్, చిక్కేపల్లి, తెల్లరాళ్లపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో విరివిరిగా మొక్కలు నాటి పచ్చదనం, సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు జయరాములుసాగర్, బా లస్వామి, లక్ష్యయ్య, ఎంపీవో రామస్వామి, పం చాయతీ కార్యదర్శులు స్రవంతి, అనిత ఉన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
గోపాల్పేట, జూలై 5 : పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవడం అందరి బాధ్యతని మండల ప్ర త్యేకాధికారి అనీల్‌కుమార్ అన్నారు. సోమవా రం పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మండలంలోని తాడిపర్తి- నర్సింగాయపల్లి ప్రధా న రహదారి పక్కన మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మ, ఉపసర్పంచ్ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి నవీన్ ఉన్నారు.
పెబ్బేరులో..
పెబ్బేరు, జూలై 5 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలో పనులు ముమ్మరంగా కొనసాతున్నాయి. అందులో భాగంగానే సోమవారం కౌన్సిలర్ అక్కమ్మ 2వ వార్డులో శిథిలావస్థలో ఉన్న పాత ఇండ్ల కూల్చివేత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్ర భుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు హరిశంకర్ నాయుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బలరాంనాయుడు, నాయకులు శేఖర్‌గౌడ్, మద్దిలేటి, వీరస్వామి, రాఘవేందర్, కాలనీ వాసులు ఉన్నారు.
కొప్పునూరులో..
చిన్నంబావి, జూలై 5 : నాల్గో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొప్పునూరు గ్రామంలో సర్పంచ్ నందికౌసల్యారెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రా మంలోని మురుగు కాలువలను పరిశీలించి, పూ డికను తీయించారు. రహదారికి ఇరువైపులా పెరిగిన ముళ్ల పొదలను పారిశుధ్య కార్మికులు తొలగించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మి, కార్యదర్శి రమేశ్, ఉపసర్పంచ్ ఆనంద్‌యాదవ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నాటిన మొక్కలనూ బతికిద్దాం
కొత్తకోట, జూలై 5 : నాటిన మొక్కలనూ బతికిద్దామని జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని పాలెం, నిర్వేన్ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జెడ్పీ వైస్‌చైర్మన్‌తోపాటు ఎంపీపీ గుంతమౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్‌చైర్మన్ మాట్లాడుతూ పల్లెలు బా గుంటేనే పట్టణాలు బాగుంటాయన్నారు. నర్సరీ లో మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాధమ్మ, విశ్వనాథం, ఎంపీటీసీ సవరయ్య, నాయకులు రామకృష్ణారెడ్డి, మైబు, అలీం, ఎంపీడీవో శ్రీపాదు, బాలకొండయ్య, పరమేశ్ పాల్గొన్నారు.