మహబూబ్‌నగర్ కలెక్టరేట్/మూసాపేట, మార్చి 6 : తండ్రి కలగన్నాడు.. కొడుకు నెరవేర్చాడు.. ఇది పాలమూరు బిడ్డ సాధించిన ఘనత అని సగర్వంగా చెప్పుకోవచ్చు.. మూడు పర్యాయాలు అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయినా.. మొక్కవోని దీక్షతో సవాళ్లను ఎదుర్కొని.. అదే పరీక్షల్లో నాలుగో ప్ర యత్నంలో యూపీఎస్సీలో విజయం సా ధించాడు. శుక్రవారం వెల్లడించిన ఫలితాల్లో నిజాలాపూర్‌కు చెందిన యువకుడు వెంకటేశ్ ప్రసాద్ సాగర్ ఆలిండియా 358వ ర్యాంకు సాధించాడు.
ప్రస్తుతం నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న వెంకటేశ్ ప్రసాద్ సాగర్ సాధించిన విజయ బావుటాపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథ నం. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి వెంకటేశ్‌ప్రసాద్ సాగర్.. రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సత్తయ్య విద్యుత్‌శాఖలో ఏఈగా పనిచేస్తుండగా.. తల్లి యశోధ గృహిణి.
సత్తయ్య తన కొడుకును చిన్నప్పటి నుంచే ఐఏఎస్ చేయాలని కలగన్నాడు.. విద్యుత్‌శాఖలో జేఎల్ఎంగా 2007లో చేరిన ఆయన జిల్లా పరిపాలన యంత్రాంగం.. వాటిలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అందిస్తున్న సేవలను కళ్లారా చూస్తూ.. ఆ దిశగా.. ఆ స్థాయికి మన పిల్లలు చేరుకోలేరా? అంటూ ప్రశ్నించుకున్నాడు.. ఆ ప్రశ్నకు సమాధానం నేడు వెంకటేశ్‌ప్రసాద్ సాగర్ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. పల్లెటూరి నుంచి పరిపాలనలో మన బిడ్డలు ఉండాలనే దృఢ నిశ్చయంతో సత్తయ్య తన కొడుకును ఉన్నతంగా చదివించాలని లక్ష్యం నిర్ధేశించుకున్నాడు. తన ఒక్కగానొక్క కుమారుడు డిగ్రీ చదువుతుండగానే ఐఏఎస్ లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించాడు.
ఆ దిశగా అన్ని రకాలుగా మార్గనిర్దేశం చేస్తూ.. బిడ్డ ఉన్నతికి తోడ్పాటు నందిస్తూ ప్రోత్సహించగా.. తాను పీజీ చేశాకే.. యూపీఎస్సీ పరీక్ష రాస్తానని కుమారుడు అనడంతో ఏదైనా సరే.. ఐఏఎస్ సాధించాలి.. ఉన్న ఊరికి కన్నవారికి మంచి పేరు తేవాలని సూచించాడు. వెనుకబడిన పాలమూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరి నుంచి పరిపాలనలో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలన్న నా కల నెరవేర్చాలని, ఉన్నతమైన చదువు లు చదివిన అనేక మం ది ఇతర దేశాలకు వెళ్ల డం నాకేమాత్రం న చ్చడం లేదంటూ కొ డుకుతో అనేక ప ర్యాయాలు చెప్పుకొచ్చారు. దానికి భిన్న ంగా మనం ఉండాల ని కోరడంతో నా కొ డు కు ఐఏఎస్ సాధించాడని గర్వంగా చెబుతున్నాడు. తక్కువ కాలంలో కష్టపడి ఉన్నత స్థానం పొందడం మా ఊరికి.. మండలానికి గర్వ కార ణమని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.