బిజినేపల్లి, జనవరి 22: పేదల దేవుడిగా విరాజిల్లుతోన్న పాలెం వెంకన్న వార్షిక బ్ర హ్మోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 30 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ శేఖర్‌రెడ్డి, ఈ.వో రంగారావు తెలిపారు. ఉత్సవాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మం ది భక్తులు తరలి వస్తుంటారని వారికి ఎలాంటి ఇబ్బంద్దులు కలుగకుండా ఏర్పా ట్లు చేసినట్లు వారు తెలిపారు.
ఆలయ చరిత్ర
పాలెం గ్రామ నిర్మాత దివంగత తోటపల్లి సుబ్రమణ్యశర్మ ప్రోద్భలంతో ఆయన సన్ని హితులైన రామలింగయ్య, బాల్‌లింగయ్య శ్రీశైలం ప్రధాన రహదారి సమీపంలో 1961లో 13 ఎకరాల భూమని కొనుగోలు చేసి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. స్వామివారి మూలవిరాట్‌ను తిరుమల తిరు పతిలోని పాపనాసిని, అలువేలు మంగమ్మ అమ్మవారి విగ్రహాలను రాయచోటి నుంచి తెచ్చి 1962లో ప్రతిష్టించారు. ఆలయాన్ని 1976లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుంది.
తిరుమలలోగా స్వామివారికి ఇక్కడి తోటలో పూసి న పూలతోనే పూజిస్తుంటా రు. 1978లో టీటీడీ నిధులతో కల్యాణ మం డపం నిర్మాణం చేపట్టారు. గతంలో ఆల య నిధులతో వెంకటేశ్వర డిగ్రీ కళాశాలను నిర్మించడంతో పాటు విద్యార్థులకు హాస్టల్ వసతికల్పించారు. దేవాలయం ముఖ మంటపం, ధర్మసత్రం, కోనే రు, కళ్యాణ మండపంతో పాటు ప్రస్తుతం ఆలయం ప్రాంగణంలో షెడ్ నిర్మా ణం వంటి అభివృద్ధి పనులను చేశారు.
2003లో ఆలయ ధర్మకర్తగా వ్యవహరించిన రమేశ్ దాతల సహకారంతో నూతన రథా న్ని చేయించి రథశాలను నిర్మించారు. పూర్వ విద్యార్థులైన మోహన్‌బాబు, బాలకిష్టయ్య దంపతులు స్వామి, అమ్మ వారుల గర్భగుడి అభివృద్ధి పనులు చేపట్టా రు. ఇలా దినదినాభివృద్ధి చెందుతోంది. తిరుమల తిరుపతికి వెళ్లలేని పేదలు పాలం వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని తమ మొక్కలు చెల్లించుకుంటారు. దీంతో ఈ ఆలయం పేద ల తిరుపతిగా వె లు గొందుతోంది.
ఆలయంలో ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు, ధనుర్మాస పూజలు, సంక్రాంతి, దసరా, ఉగా ది, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రావ ణ, కార్తీక మాసంలో సామూహిక లక్ష దీపార్చన వంటి కార్యక్ర మాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల వివరాలు
వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సో మవారం స్వామివారికి అభిషేకాలు, కోయిల్అల్వార్ తిరుమంజనం, పూర్వ విద్యార్థు ల సేవా సమితి, చైతన్య కల్చరర్ క్లబ్ ఆధ్వర్యంలో మండలస్థాయి భాగవత పద్య పోటీలు, సాయంత్రం యాగశాల ప్రవేశం, అంకురార్పణ, రక్షాబంధనం, వెం కన్నస్వామికి హంస వాహన సేవా, మంగళ వారం నిత్యారాధన, హోమం బలిహరణ, ధ్వజారోహణం, గరుడ పొంగలి నివేదన సం తానం లేని వారికి ప్రసాద వితరణ, ప్రబంధ పారాయణం, రాత్రి వేళ హోమం, బలిహ రణ, బేదిపూజ, హనుమత్ వాహనసేవ, 25న నిత్య పూజా కార్యక్రమాలు, లక్ష పుష్పార్చన, మండల స్థాయి వేంకటేశ్వర సామి సుప్రభాత పఠన పోటీలు,
26న నిత్య పూజా కార్యక్రమాలు, అలువేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, రాత్రి వేళ జగవాహన సేవా, 27న ప్రబంధ పారాయణం, జిల్లాస్థాయి భజన పోటీలు, 28న నిత్యారాధన, మండల స్థాయి గోవింద నామాల పోటీలు అనంతరం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, రాత్రి స్వామివారి రథోత్సవం, 29న ప్రబంధ పారాయణం, ఉద్దాల మహోత్సవం, రాత్రి వేళ అశ్వవాహన సేవా, 30న నిత్యారాధన, పూర్ణాహుతి, చక్రస్నానం, రాత్రి ధ్వజారో హణం, పుష్పయాగం, శేష వాహనసేవ, పండితులకు సన్మానం, ముఖబలితో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.