వెల్దండ : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ( Entrance Exam ) ప్రశాంతంగా ముగిసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ ( Principal ) తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లకు గాను 222 దరఖాస్తులు రాగా 159మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. అదేవిధంగా 7వ నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు గాను196 దరఖాస్తులు రాగా 141 మంది హాజరు అయినట్లు వెల్లడించారు.
పరీక్షల సందర్భంగా విద్యార్థుల హాల్ టికెట్లను( Hall Tickets ) పరిశీలించి హాలు లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.