మక్తల్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చేపట్టే వీర హనుమాన్ విజయ శోభాయాత్రను (Hanuman Shobha Yatra ) విజయవంతం చేయాలని భజరంగదళ్( Bajrang Dal )జిల్లా సహా సంయోజక్ పసుపుల భీమేష్ కోరారు. పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం వీర హనుమాన్ విజయ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
శోభాయాత్ర మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ చౌరస్తా ఉమామహేశ్వర ఆలయం నుంచి సాయంత్రము 4:30 గంటలకు ప్రారంభమై ఛత్రపతి నగర్, యాదవ నగర్, బ్రాహ్మణవాడ,వాకిటి వీధి, గాంధీ చౌక్, ఆజాద్ నగర్ మీదుగా శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగుతుందన్నారు. గ్రామ గ్రామాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి వీర హనుమాన్ విజయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు.
సమావేశంలో విశ్వహిందూ పరిషత్ నారాయణపేట జిల్లా సహ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వాకిటి భీమన్న, భజరంగ్ దళ్ ప్రఖండ సంయోజక్ రాహుల్, సహా సంయోజక్ శివ, గోరక్ష ప్రముఖ్ అనిల్, మండల సంయోజక్ రామాంజనేయులు, నవీన్, పరశురాం, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.