వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి
ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు డ్రిల్లింగ్ చేయడం సరికాదని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఇష్టానుసారంగా బోర్లు వేసేందుకు అనుమతి
ఇష్టానుసారంగా బోర్లు వేస్తే కుదరదు
హరితహారానికి చర్యలు చేపట్టాలి : కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్‌నగర్, మే 9: ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు డ్రిల్లింగ్ చేయడం సరికాదని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఇష్టానుసారంగా బోర్లు వేసేందుకు అనుమతి లేదన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అనుమతివ్వాలని ఆదేశించారు. వర్షాకాలంలో మొక్కలు నాటేందుకుగానూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈత మొక్కలను సైతం నాటేలా చూడాలన్నారు. ఈనెల 10లోపు అన్ని శాఖల అధికారులు హరితహారంపై నివేదికలను సమర్పించాలని, మండల స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కోటి మొక్కలకు తక్కువ కాకుండా నాటుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్‌పవర్, సీతారామారావు, డీఆర్డీవో యాదయ్య, ఆర్డీవో పద్మశ్రీ, జెడ్పీ సీఈవో జ్యోతి పాల్గొన్నారు.
ప్రతి సమస్యను పరిష్కరించాలి
ప్రజావాణికి రాకముందు అధికారులు పూర్తిస్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, పింఛన్లు, ఆస్తి తగాదాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణికి 74ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.
కళాభారతి పరిశీలన
మహబూబ్‌నగర్ టౌన్, మే 9: మున్సిపాలిటీ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న కళాభారతి ని ఆదివారం కలెక్టర్ ఎస్. వెంకట్రావు పరిశీలించారు. పనులకు సంబంధి పూర్తి స్థాయి వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ అన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

