వనపర్తి, అక్టోబర్ 28: జీవితంలో ప్రతిఒక్కరూ కృషి చేస్తే మహర్షి వాల్మీకిలా గొప్ప ఆదర్శవంతులుగా తయారవుతారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నాగవరం వద్ద నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొని వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాల్మీకి జీవితాన్ని ముందుతరాలకు తెలియజేయాలన్నారు. కృషి చేస్తే మనుషులు ఋషులవుతారనడానికి ఆయన మనకు స్ఫూర్తిదాయకమన్నారు. పుట్టుకతో ఎవరూ అసామాన్యులు కారని, పట్టుదలతో అనుకున్న లక్ష్యం కోసం కృషిచేస్తేనే దానిని సాధించగలుగుతామన్నారు. వాల్మీకి జీవిత చరిత్ర ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమైనదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, రాష్ట్ర మార్క్‌ఫైడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, ఆర్టీఏ అథారిటీ జిల్లా సభ్యుడు రమేశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవర్ల నర్సింహ, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దముక్కుల రవి, బీఆర్ఎస్ నాయకులు పరంజ్యోతి, శివ, నాగవరం వాల్మీకి సంఘం నాయకులు, జిల్లా నాయకులు చిన్నరాములు, రాములు, సత్యం, వెంకటయ్య, ఆంజనేయులు, కృష్ణ, మహేశ్, రామస్వామి, పులేందర్, సునీల్, మధులత, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక క్రీడకారులకు అనేక ప్రోత్సాహకాలను అందించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంత్రి నివాసంలో తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి మంత్రి సింగిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మంత్రి నిరంజన్‌రెడ్డికి తోడుగా నిలిచి మరోసారి అయనను గెలుపించుకోవాల్సిన బాధ్యతతో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అలాగే పెద్దమందడి మండలంలోని ముందరితండాకు చెందిన 30 మంది యువకులు శనివారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ముందుగా పార్టీలో చేరిన యువకులకు మంత్రి కండువా వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఎస్సీ సెల్ నాయకుడు గోపాల్‌నాయక్, ఉపసర్పంచ్ రమేశ్‌నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, యువజన అధ్యక్షుడు మహేశ్ ఆధ్వర్యంలో 30 మంది యువకులు చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మార్కెట్ చైర్మన్ పలుస రమేశ్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, సోషల్‌మీడియా జిల్లా కన్వీనర్ బీచుపల్లియాదవ్, నిరంజన్, మీడియా సెల్ ఇన్చార్జి నందిమళ్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.