పాలమూరు, జూన్ 4 : నీట్ యూజీ ఫలితాల్లో పాలమూరులోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యనందించి సాధారణ విద్యార్థులను సైతం డాక్టర్లుగా మార్చిన ఘనత వాగ్దేవికళాశాలదే అని అన్నారు. ఇంతటి ఘనవిజయంలో అధ్యాపకుల కృషి ఎనలేనిదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చి వారి కలను నిజం చేసిన ఘనత తమ కళాశాలకే దక్కుతుందన్నారు. 45 మందిలో 30 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో ఐఐటీ, నీట్ అకాడమీ ఇన్చార్జి పావనిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గీతాదే వి, వైస్‌ప్రిన్సిపాల్ జ్యోతీనందన్రెడ్డి, అకాడమీ అడ్వైజర్ యాకూబ్, ఎంసెట్ ఇన్చార్జి షాకీర్, ఎగ్జామినేషన్ ఇన్చార్జి చెన్నయ్య, యాజమాన్య సభ్యులు కోట్ల శివకుమార్ తదితరులు ఉన్నారు.