మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 11: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో నిర్వహించిన ఎప్‌సెట్ ఫలితా ల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారని ఆ కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ర్యాంకర్లను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడు తూ.. రాష్ట్రస్థాయిలో సాయి దీపిక 741వ ర్యాంక్, జువేరియా-1279, రబ్షా-2191, తజ్రీబ్-3483, శ్రీహరి-5223, నూరిన్-5486, రాజేశ్వరీ-5627, ప్రియాంక- 7052, వైష్ణవి-7162, సీమ-8353, నవనీ త్ కుమార్‌గౌడ్-8391, పవన్‌కళ్యాన్-861 3, ఆనుష్క-8638, అబేదా-8684, మౌని క-8730, జ్ఞానేశ్వర్-9468, యమునా-9573 ర్యాంకుతోపాటు 15వేలలోపు ర్యాం కులు 22 మంది విద్యార్థులు, 20వేలలోపు ర్యాంకులు 29 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీతాదేవి, ఐఐటీ నీట్ అకాడమీ ఇన్‌చార్జ్జి పావనిరెడ్డి, ఎంసెట్ ఇన్‌ఛార్జి షాకీర్, యాజమాన్య సభ్యులు రాఘవేంద్రారావు, కోట్ల శివకుమా ర్, నాగేందర్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.