మక్తల్ రూరల్, మే 13 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేపట్టిన కార్గో సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కో రారు. పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో కార్గో సేవలను శు క్రవారం ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్ ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు రవాణా చేయడానికి కార్గో బస్సులను సర్కారు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. అన్ని బస్టాండ్లలో సరుకు ల డెలివరీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారన్నా రు. దీనివల్ల వినియోగదారులకు సరుకులు, పార్శిల్స్ త్వరితగతిన చేరవేస్తారని, ఎంతో నమ్మంగా, భద్రంగా సేవల ను ఆర్టీసీ సిబ్బంది అందజేస్తున్నారన్నారు. ప్రతిఒక్కరూ టీఎస్ ఆర్టీసీ సంస్థ చేపట్టిన కార్గో సేవలను వినియోగించు కోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మార్కెట్ క మిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, వైస్ చైర్మన్ అనిల్‌కుమార్, మార్కె ట్ కమిటీ డైరెక్టర్ సాలమ్, కౌన్సిలర్లు మొగులప్ప, రాము లు, ఆర్టీసీ కంట్రోలర్ ప్రభాకర్, టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రాంలింగం, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు మహిపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మాగనూర్ మండల అధ్యక్షు డు ఎల్లారెడ్డి, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, నాయకులు త దితరులు పాల్గొన్నారు.