మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మార్చి 15 : సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్వీ పాలమూ రు యూనివర్సిటీ కన్వీనర్ భరత్‌బాబు డిమాండ్ చేశారు. యూనివర్సిటీలోని 400ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే చర్యలను నిరసిస్తూ శ నివారం పీయూ ఎదుట బీఆర్ఎస్వీ ఆ ధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఈ సం దర్భంగా భరత్‌బాబు మాట్లాడుతూ సీ ఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా అప్పులు చే స్తూ.. ప్రభుత్వ సంపదను పెంచుకోవడం కోసం వర్సిటీ భూములను అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటన్నారు. భూములను వే లం వేయడమంటే రాష్ట్ర ప్రభుత్వ విలువను బజార్లో పెట్టి అమ్ముకోవడమే అవుతుందన్నారు. భవిష్యత్తు తరాలను దృ ష్టిలో పెట్టుకుని 1970 ప్రాంతంలో కేం ద్రం హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా, ఆ భూములను రేవంత్‌రెడ్డి సర్కార్ అ మ్మాలనుకోవడం దారుణమైన చర్యగా అభివర్ణించారు.
బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీ భూములను కేసీఆర్ పరిరక్షించారని తెలిపారు. ఉన్న భూములను అమ్ముకుంటూ పోతే వర్సిటీలో కొత్త భవనాలను కట్టడానికి స్థలం అవసరమైతే రేవంత్‌రెడ్డి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని రద్దు చేసేంత వరకు విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తి రుమలేశ్, ఆంజనేయులు, రామకృష్ణ, మల్లేశ్, శశికుమార్, మల్లేశ్నాయుడు, పరశురాముడు, రవీందర్, యామిని, కవిత, మాధవి, గీతాంజలి తదితరు లు పాల్గొన్నారు.