అచ్చంపేట రూరల్ : మే డే అమరవీరుల స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం( CPM ) జిల్లా సీనియర్ నాయకులు శంకర్ నాయక్( Shanker Naik ) పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని సింగారం గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను నిర్వహించారు. పార్టీ గ్రామ కార్యదర్శి బక్కయ్య జెండాను ఆవిష్కరించగా శంకర్ నాయక్ మాట్లాడారు.
అమెరికా దేశంలోని చికాగో నగరంలో హే మార్కెట్లో కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పోరాటం చేసి మే ( May ) 1 న 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారని తెలిపారు. దేశ సంపద కొద్ది మంది చేతిలో ఉండటం వల్ల మళ్లీ పని గంటలు పెంచాలని కేంద్రం ఆలోచిస్తుందని ఆరోపించారు. స్వతంత్ర కాలంలో పోరాటం చేసి సాధించుకున్న 64 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొస్తుందని విమర్శించారు.
కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా ఆ కోడ్లను అడ్డుకోగలుగుతున్నామని అన్నారు. మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ కోడ్లను అమలు చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు బి రాములు,మండల కార్యదర్శి సైదులు, గ్రామ కార్యదర్శి బక్కయ్య, మాజీ సర్పంచ్ లు జరుపుల చంద్రు నాయక్, కొండేమోని బాలింగయ్య, సీనియర్ నాయకులు చిన్న అంజనేయ, వెంకటయ్య, రవి, సత్యం, శ్రీను, చంద్రయ్య తదితరులు ఉన్నారు.