కందనూలు, జూలై 27 : ఆర్టీసీ వినూత్న ప్రయత్నాలతో ప్రజలను ఆదాయాన్ని పెం చుకునేందుకు ఆకర్షిస్తున్నది. ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటుండగా, తాజాగా పల్లెవెలుగు బస్సుల్లో రూ.50 చెల్లించి ఒక రోజంతా 30 కి.మీ. ప్రయాణిచేలా టీ9-30 టికెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వినూత్న ప్రయోగానికి గురువారం రాష్ట్రంలో ప్రారంభించారు. గత నెలలో గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం టీ-9 టికెట్లను ప్రవేశపెట్టగా, మంచి స్ప ందన లభించింది. దీంతో వయస్సుతో ని మిత్తం లేకుండా సాధారణ ప్రయాణికులకు టీ9-30టికెట్ వర్తించనుంది. ఉమ్మడి జిల్లా లో 526 పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నా యి. దాదాపు 90శాతం ప్రయాణికులు పల్లెవెలుగు బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు.
టీ9-30 టికెట్ వివరాలు ఇలా..
టీ9-30 టికెట్ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ప్రయాణికులు టికెట్టును వినియోగించుకోవచ్చు. 30కిలోమీటర్ల వరకు రాను పోను ప్రయాణం చేయవచ్చు. టికెట్టు ధర రూ.50 ఉండగా, టోల్గేట్ల చార్జీలకు ఇందులో మినహాయింపు. దీంతో ఒక్కొక్కరికీ సగటున రూ.20 నుంచి రూ.40వరకు ఆదా చేసుకునే అవకాశం లభిస్తున్నది. ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేయాలంటే అదనంగా రూ.20 కాంబీ టికెట్టు తీసుకుని ప్రయాణం చేయవచ్చు. అలాగే 20కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు రాష్ర్టాలకు టికెట్టు తీసుకుని ప్రయాణం చేయవచ్చు. అలంపూర్ నుంచి కర్నూల్ 26 కిలోమీటర్ల దూరం, మాగనూర్ నుంచి రాయిచూర్‌కు 31 కి.మీ. దూరం ఉండగా, ఈ టికెట్టుతో ప్రయాణించడం ద్వారా మేలు చేకూరనున్నది.
ప్రయాణికులను ఆకర్షించేందుకు..
జిల్లావ్యాప్తంగా నాలుగు ఆర్టీసీ డిపో పరిధిలో సుమారుగా 250 పైగా పల్లె వెలుగు బస్సులు నడుస్తున్నాయి. దీంతో టీ9-30 టికెట్టుకు ఆదరణ లభించనున్నది. ప్రైవేట్ వాహనాల యజమానులు ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తూ సామర్థ్యానికి మిం చి ప్రయాణికులను చేరవేస్తున్న క్రమంలో ఆర్టీసీ వివిధ వినూత్న కార్యమ్రాలతో ప్రజలను తమవైపు ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ ధరలను తగ్గిస్తూ ఆఫర్లను కల్పిస్తోంది.
ప్రయాణికులకు లాభం..
ప్రయాణికుల ప్రయోజనం కోసం టీ9-30 టికెట్టు తీసుకురావడం ఆర్టీసీ ఆలోచన బాగుంది. ప్రతి రోజూ 30కిలోమీటర్ల వరకు నేను ప్రయాణం చేస్తాను. టీ9 టికెట్‌తో దాదాపు రూ.20వరకు డబ్బు ఆదా అవుతుంది. ప్రైవేటు వాహనాల్లో అధికంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ వినూత్న ఆలోచనలతో ప్రయాణికులకు మేలు చేకూరుతుంది.
– పాషా, నాగర్‌కర్నూల్