గట్టు, జనవరి 8 : ఓ ట్రాక్టర్ చిన్నారిని చిదిమేసిన ఘటన తుమ్మలపల్లిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సంధ్య, హుస్సేన్‌ల కూతురు రిషిక(4) ఇంటి ముందున్న రోడ్డు పక్కన ఆడుకుంటోంది. ఈ సమయంలో సమీపంలోని బోయ సత్తెమ్మ ఇంటి వద్దకు ఇటుకలోడ్తో కర్ణాటక నుంచి ట్రాక్టర్ వచ్చింది.
ఇటుకను అన్లోడ్ చేసిన తరువాత డ్రైవర్ ట్రాక్టర్‌ను వేగంగా, అజాగ్రత్తగా రివర్స్ చేయడానికి ఉపక్రమించాడు. ఈ సమయంలో అక్కడే ఆడుకుంటున్న రిషిక ప్రమాదవశాత్తు ట్రాలీ ఎడమవైపు టైర్ కింద పడింది. దీంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. పాప మృతితో సంధ్య, హుస్సేన్‌ల కుటుంబంలో విషాదం అలముకుంది. సంధ్య ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కేటీ మల్లేశ్ తెలిపారు.