మాగనూరు : ఇంటి నిర్మాణాలతోపాటు మరుగుదొడ్లు ( Toilets ) కూడా తప్పనిసరి నిర్మించుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ( MLA Vakati Srihari ) అన్నారు. సోమవారం మాగనూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముందుగా మాగనూరు మండల కేంద్రానికి చెందిన జుట్ల అంజమ్మ, దయ్యాలదుర్గప్ప, ఇంటి నిర్మాణానికి టెంకాయలు కొట్టి భూమి పూజ నిర్వహించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా రెండు నెలల్లోనే ఇల్లు నిర్మాణం చేసుకోవాలని, ఇంటి నిర్మాణంతో పాటు మరుగుదొడ్లు కూడా తప్పనిసరి నిర్మించుకోవాలని కోరారు. మరుగుదొడ్లు కట్టించకపోతే ఇంటి నిర్మాణానికి డబ్బులు ఆపుతామని , ఇంటి చుట్టూ పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరు ఇంటి చుట్టూ మొక్కలు నాటాలని సూచించారు.
మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రహమతుద్దీన్, హౌసింగ్ ఏఈ అంజి, పంచాయతీ కార్యదర్శి తిమ్మప్ప, మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, శివరాం రెడ్డి, వాకిటి శీను, దండు ఆనంద్, బాబయ్య, కృష్ణయ్య, రాము, ముష్టి లక్ష్మన్న, వేణు గౌడ్, గోపాల్ రెడ్డి, రాజు, కృష్ణ, పాండు, చంద్రకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.