మధుమేహం వేధిస్తోన్నతియ్యనివ్యాధి
మధుమేహం ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ కనిపించే జబ్బు. ఏ నలుగురు కలిసినా, వారిలో ఒకరు షుగర్ పేషంట్ ఉంటున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా జబ్బు విజృంభిస్తోంది.
- ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి
- కుటుంబ సభ్యులకు వస్తే మద్దతుగా నిలవాలి
- ప్రీ డయాబెటిక్‌ను గుర్తిస్తే..నివారణ సాధ్యం
- నేడు ప్రపంచ మధుమేహ నివారణం దినోత్సవం
- వేధిస్తోన్న ‘తియ్యని’ వ్యాధి
- ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి
- కుటుంబ సభ్యులకు వస్తే మద్దతుగా నిలవాలి
- ప్రీ డయాబెటిక్‌ను గుర్తిస్తే..నివారణ సాధ్యం
- నేడు ప్రపంచ మధుమేహ నివారణం దినం
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 13: మధుమేహం ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ కనిపించే జబ్బు. ఏ నలుగురు కలిసినా, వారిలో ఒకరు షుగర్ పేషంట్ ఉంటున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా జబ్బు విజృంభిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడాలేకుండా అందరినీ పీడిస్తున్నది. జనాభా పరంగా చూస్తే, షుగర్ పేషెంట్లు పట్టణ ప్రాంతాల్లో 2/3 వంతు, గ్రామీణ ప్రాంతాల్లో 1/3 వంతు ఉన్నారు. ప్రపంచ జనాభాల్లో 20 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వీరి సంఖ్య 42.5 కోట్లు. నేడు వరల్డ్ డయాబెటిక్ డే ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
మధుమేహం రకాలు
టైప్ 1: తల్లిదండ్రులకు ఈ రకం మధుమేహం ఉంటే వారి పిల్లలకు కూడా పుట్టుకతో వచ్చే ప్రమాదం ఉంది. ఇన్సులిన్ లోపం కారణంగా వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమిస్తుంది.
టైప్ 2: 35 ఏండ్లు పైబడిన వారిలో ఈ రకం మధుమేహం కనిపిస్తుంది. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల దీనిబారిన పడుతున్నారు.
ఎలా గుర్తించాలి ?
- అధిక బరువు, లేదా బరువు తగ్గిపోవడం
- ఎక్కువ ఆకలి, దాహం వేయడం
- కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం
- తరుచూ మూత్రం రావడం
- గాయాలు తగిలితే మానకపోవడం
ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ..?
- తల్లిదండ్రులకు షుగర్ వ్యాధి ఉంటే
- బాగా లావుగా ఉన్నవారికి
- రక్తపోటు ఉన్నవారికి
- కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకునేవారికి..
- రక్త సంబంధీకులకు షుగర్ వ్యాధి ఉంటే..
- కుటుంబంలో షుగర్ ఉంటే ..
‘మధుమేహం బారిన పడినవారికి కుటుంబం అండగా నిలవడం, ఇంట్లో తీసుకోవాల్సిన చర్యలపై చైతన్యం కల్పించడం’ ఈవిషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈఏడాది అంశంగా ఎంచుకున్నది. దీని ప్రకారం.. కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే మిగిలిన సభ్యులు వ్యాధి ఉన్నవారిలో ైస్థెర్యం నింపాలి. ప్రతి 3నెలలకు ఒకసారి వైద్యపరీక్షలు చేయించాలి. పాలిష్ బియ్యంతో కాకుండా ముతక బియ్యంతో చేసిన అన్నం ఆహారంగా ఇవ్వాలి.
షుగర్ డే..
మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. 1991నుంచి వ్యాధి తీవ్రతను గుర్తించిన అంతర్జాతీయ డయాబెటిక్ ఫెడరేషన్, ఏటా నవంబర్ 14న డయాబెటిక్ డే నిర్వహిస్తోంది. శరీరంలోని ఇన్సులిన్‌ను కనుగొన్న బాంటింగ్ పుట్టిన రోజు నవంబర్14. అందుకే ఆ రోజును వరల్డ్ డయాబెటిక్ డేగా నిర్వహిస్తున్నారు.
అటెన్షన్ ప్లీజ్
- మధుమేహం వ్యాధి 10 సంవత్సరాల ముందు నుంచే నివురుగప్పిన నిప్పులా పొంచి ఉంటుంది.
- 25 ఏండ్లు దాటినవారు ఆరు నెలలకు లేదా ఏడాదికోసారి రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది.
- ఎక్కువగా కూర్చుని పనిచేసేవారు ప్రతిగంట, రెండు గంటలకు ఒకసారి అటూ ఇటూ తిరగాలి.
- పొగాకు ఉత్పత్తులు వాడే వారిలో రక్తనాళాలు సన్నబడుతాయి. తద్వారా రక్తప్రసరణకు అడ్డంకులు వస్తాయి.
- ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడపకూడదు.
- శరీర అధిక బరువును తగ్గించుకోవాలి.
- ఆల్కహాల్, పొగతాగడం మానేయాలి
పిల్లల్లో కూడా అధికమే..
పిల్లలపై కూడా మధుమేహం ప్రభావం తీవ్రంగా ఉంటున్నది. ప్రతి వెయ్యి మందిలో ఒక చిన్నారి మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు వంశపారంపర్యంగా ఈ జబ్బు సోకే ప్రమాదం ఉంటుంది. డయాబెటిక్ అంటే.. రక్తంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో చక్కెర ఉండటం. ఇది మూత్రం ద్వారా బయటికి పోతుంది. శరీరంలో ఇన్సులిన్ పనిచేసే విధానంలో చిన్నలోపం వల్ల ఆహార పదార్థాలను శరీరం సక్రమంగా వినియోగించుకోలేదు. ఈకారణంగా షుగర్ వ్యాధి సోకుతుంది. సాధారణంగా రక్తంలో చెక్కర నిల్వలు తినకముందు 100 లోపు… తిన్న తర్వాత 140లోపు ఉండాలి. సాధారణ వ్యక్తులు 126/200 ఉంటే షుగర్ ఉన్నట్లు భావించి, వైద్యులను సంప్రదించాలి.
నడక రక్షణ
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు మందులు వాడటం, సరైన ఆహారం తీసుకోవడమే కాకుండా ప్రతిరోజూ నడకగాని, వ్యాయామంగాని చేయాలి. రోజూ చెమట వచ్చే విధంగా 30నిమిషాలు నడిస్తే రోగి శరీరంలో ఇన్సులిన్ సరిగా పనిచేస్తుంది. కొవ్వు, బరువు తగ్గుతుంది. కండరాలను ధృడం చేస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడి, గుండె జబ్బులను దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
పరీక్షలు చేయించుకోవాలి
ప్రతి ఒక్కరూ తరుచూ రక్త పరీక్షలు చేయించుకోవాలి. మంచి ఆహారం, నడక, యోగా, సమయానికి ఆహారం తీసుకోవడంతో షుగర్ వ్యాధి సోకదు. షుగర్ ఉన్నవారు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ వస్తుంది. షుగర్ వల్ల బీపీ, పక్షవాతం, గుండెపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులు సోకుతాయి.
– డాక్టర్ బాల శ్రీనివాస్, జనరల్ ఫిజీషియన్, ఎండీ ప్రభుత్వ జనరల్ దవాఖాన,
మహబూబ్‌నగర్
వ్యాధి రాకుండా ఉండాలంటే ..
- రోజుకు కనీసం 30నిమిషాలు వ్యాయామం చేయాలి
- కాయగూరలు, పండ్లు, రాగులు, జొన్నలు, గోధుమలు, సజ్జలతో చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం
- టీవీ చూసే సమయం తగ్గించడం
- నూనె వస్తువులు, జంక్ ఫుడ్స్, కూల్క్రింక్స్ వినియోగం తగ్గించాలి
- వరి అన్నం తక్కువగా తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే కొర్రన్నం తినాలి. మాంసంతో పాటు కొవ్వు, చక్కెరకు సంబధించిన ఆహారానికి దూరంగా ఉండాలి.
ఎలా గుర్తించాలి ?
- అధిక బరువు, లేదా బరువు తగ్గిపోవడం
- ఎక్కువ ఆకలి, దాహం వేయడం
- కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం
- తరుచూ మూత్రం రావడం
- గాయాలు తగిలితే మానకపోవడం
- ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ..?
- తల్లిదండ్రులకు షుగర్ వ్యాధి ఉంటే
- బాగా లావుగా ఉన్నవారికి
- రక్తపోటు ఉన్నవారికి
- కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకునేవారికి..
- రక్త సంబంధీకులకు షుగర్ వ్యాధి ఉంటే..
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- World Diabetes Day
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

