అయిజ, జనవరి 7: కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటినిల్వ క్రమేపీ తగ్గిపోతున్నది. తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్కు నీటి విడుదల పూర్తిగా నిలిచిపోవడంతో ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఆర్డీఎస్కు 285 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 215 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 95క్యూసెక్కులు ఆర్డీఎస్ స్లూయిస్ గుండా దిగువకు ప్రవహిస్తున్న ది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 5.9 అడుగుల నీటిమ ట్టం ఉన్నట్లు ఆర్డీఎస్ ఈఈ విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం నుంచి ఈనెల 17వరకు టీబీ డ్యాం నుంచి రెండో విడుత ఇండెంట్లో భాగంగా 1.04 టీఎంసీల నీ టిని పదిరోజులపాటు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మొ దటి ఐదు రోజులు 1500 క్యూసెక్కులు, చివరి ఐదు రో జులు వెయ్యి క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్న టు ్ల తెలిపారు. ఈనెల 10వ తేదీ నాటికి ఆర్డీఎస్ ఆనకట్ట కు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందని పేర్కొన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
టీబీ డ్యాంలో నీటినిల్వ
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో నిలిచిపోగా.., అవుట్‌ఫ్లో 8,091 క్యూసెక్కులు ఉన్నది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 76.320 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. 1,633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికిగానూ, ప్రస్తుతం 1,624.95 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.