వినాయకుడి పండుగకు ఊరూవాడా సిద్ధమైంది. శనివారం పల్లె మొదలు పట్నం వరకు వాడవాడలా విభిన్న రూపాల్లోని విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. మండపాలను చూడముచ్చటగా ముస్తాబు చేశారు. చిన్నారులు, యువత ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. లౌడ్ స్పీకర్లు, సౌండ్ బాక్స్‌లు బిగించారు. ‘మహా గణపతిం.. మనసాస్మరామి’.. అంటూ భక్తుల నామస్మరణ మార్మోగనున్నది. విఘ్నాలు తొలగించు వినాయకా.. అంటూ మనసారా కొలవనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లల్లో సందడి నెలకొన్నది. పండ్లు, వనం, అలంకరణ వస్తువుల అమ్మకాలతో జోష్ నెలకొన్నది.
గద్వాల టౌన్/ మహబూ బ్‌నగర్, సెప్టెంబర్ 6 : విఘ్నాలు తొ లిగించే విఘ్నేశ్వరు డు.. ముక్కోటి దేవత లతో తొలి పూజలు అందుకు నే ఆదిదేవుడు.. ఆపదలో ఆదుకునే లంబోధరుడు.. విద్యకు నాయకుడు వినాయకుడు.. గరిక పూజలకే సంబురపడే గణనాథుడు దివి నుంచి భువికి దిగి వచ్చేశాడు.. శనివారం వినాయక చవితిని పురస్కరించుకుని వాడవాడలా కొలువుదీరేందుకు సిద్ధమయ్యా డు.. చిన్నాపెద్ద, ధనిక, బీద తేడా లేకుండా అందరితో సమాన పూజలు అందుకోనున్నాడు.. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు..
గజముఖం.. ఏక దంతం.. పెద్ద పొట్ట.. మూషిక వాహనం.. వంటి విచిత్ర ఆహా ర్యం బాహ్యసౌందర్యం కన్నా అంతర్సౌందర్యం మంచిదైతే చాలన్న సత్యా న్ని గణేశ్ రూపం విశధీకరిస్తుంది.
వినాయక చవితి మనిషికి ప్రకృతికి మధ్య ఉండే సం బంధాన్ని తెలియ జే స్తుంది. ప్రకృతిని దైవంగా భా వించే సంస్కృతి ఒక హిందూ మతంలోనే ఉంది. వినాయక పూజలో ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో బోధ ప డుతున్నది. గణనాథుడిని ప్రతిష్ఠించిన త ర్వాత 21రకాల ప్రకృతి సిద్ధమై న పత్రాలతో పూజిస్తారు. ఈ ప త్రాలతో ఎన్నో రకాల ఆయుర్వేద మందులను తయారు చేస్తారు. 21రకాల ఆకులు, పూలతో పూజించడంలోనే మనిషి ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తాడో బోధ పడుతుంది.
తులసి, రేగు, బిల్వం, రాగి, జమ్మి, నేల మునగ, జిల్లేడు, మర్వం, దానిమ్మ, విరజాజి ఆకు, గన్నేరు, ఉమ్మెత్త, గరిక, ఉత్తరేణి, మామిడి ఆకు, విష్ణుక్రాంత పత్రం, దేవదారు, వావిలి ఆకు, దేవకాంచనం, వాకుడాకు, అర్జున పత్రం ఇలా 21 రకాల పత్రాలను స్వామి కి సమర్పిస్తారు. నవరాత్రుల్లో 21పత్రాలను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా వాటి నుంచి వెలువడే ప్రాణవాయువు ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. అలాగే వీటిని నీటిలో వేయడం ద్వారా నీటి శుద్ధి జరిగి క్రిములు నాశనమవుతాయి. 21 పత్రాల్లో అనేక ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ఒక్కో పత్రంలో ఒక్కో గుణం ఉందని పూర్వీకులు అనేక రోగాలకు విరివిగా వాడేవారు.
వినాయకుడి రూపమే ప్రత్యేకం. గజముఖం, ఏకదంతం, లంబోధరుడు, మూషిక వాహనుడు, ఇది వినాయకుడి భౌతిక రూపం. తరచి చూస్తే నిజంగానే ఆ రూ పం అపురూపం. ప్రతి సంవత్సరం బాధ్రపద మాసంలో చవితి నాడు వినాయకచవితి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. ఎవరి శక్తి కొలది వారు ఆ దేవుడి కొలుస్తారు. పిల్లల చదువు కోసం, ఇష్ట కార్యసిద్ధి కోసం, జ్ఞానం కోసం, విఘ్నాలు తొలగాలని ఇలా తొమ్మిది రోజులు వినాయక మండపాల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, భజనలు చేస్తారు. దీంతో తొమ్మిది రోజులపాటు మండపాలన్నీ భక్తులతో నిండి ఉంటాయి.
వినాయక చవితిని శనివారం నుంచి తొ మ్మిది రోజులపాటు వైభవంగా నిర్వహించుకునేందుకు భక్తులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మండపాలను సెట్టింగ్‌లు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిష్ఠించిన విగ్రహాలను 3, 5, 9, 11 రోజులు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పూజలు చేస్తారు.
పీవోపీతో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా ప్రకృతిపరమైన నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది చాలామంది మట్టి వినాయకులను ప్రతిష్ఠించడానికి మొగ్గు చూపుతున్నారు. ధర ఎక్కువైనా మట్టి ప్రతిమలనే కొనుగోలు చేసి పలువురికి ఆదర్శంగా నిలవాలన్న తాపత్రయం కనిపిస్తున్నది.
వినాయక చవితి పండుగకు పం డ్లు, పూలు, ఆకు లు, వెలక్కాయ తదితర పూజా సా మగ్రి ధరలు చుక్కలనంటా యి. ఒక్కో ఎల్లక్కాయ రూ. 10 నుంచి రూ.30ల దా కా విక్రయిస్తుండగా డజన్ అరటిపండ్లు రూ. 80లు రేటు దాటింది. చివరికి పొలాల్లో దొరికే గరక, ఉత్తరేణి, గురుగుపూలు, చెరకు తదితర ప్రకృతిపరమైనవి కూడా మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. అన్ని కలిపి తయారు చేసిన ఒక కట్టను రూ. 50నుంచి రూ.100వరకు విక్రయించారు. ఇక పూల ధరలు కూడా ఆకాశాన్నంటాయి.
మహబూబ్‌నగర్ పోలీస్ శాఖ పరిధిలో ఇప్పటి వరకు 500మండపాలకుపైగా విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు అనుమతులు పొందిన ట్లు అధికారు లు తెలిపారు.