లింగాల, జనవరి 25 : ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా ఈనెల 17వ తేదీ నుంచి చేపట్టిన వన్యప్రాణులు, పెద్దపులుల గణన ఆదివారం ముగినట్లు ఎఫ్ఆర్వో ఈశ్వర్ తెలిపారు. లింగాల రేంజ్ పరిధిలో 15వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి ప్రాంతం విస్తరించి ఉందన్నా రు. అందులో 4సెక్షన్లు, 13బీట్స్గా విభజించినట్లు తెలిపారు. భౌరమ్మ టైగర్ ఎఫ్-18 పెద్దపులి దాని పిల్లలు, ఎం19 అనే పెద్దపులి అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా అటవీ ప్రాం తంలో చిరుత పులులు, అడవి పిల్లులు, ఎలుగుబంట్లు వంటి మాంసాహార జంతువులతోపాటు చుక్క దుప్పులు, మాన్ల, అడవి పందులు, ముళ్లపందులు గుర్తించినట్లు తెలిపారు. పెద్దపులులు, చిరుతలకు సంతానోత్పత్తి, సంచరించడానికి ఈ అడవి ప్రాంతం అనుకూలంగా ఉంటుందని శాస్త్రీయంగా నమోదు చేసినట్లు తెలిపారు. అడవి ప్రాం తంలో సోలార్ బోర్లు వేసి నవ్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో జయదేవ్, నరేంద్రకుమార్, ఎఫ్ఎస్వో రాంబాబు, బీట్ అధికారులు ఖాదర్పాషా, శివాజీ, మురళీకృష్ణ, రమేశ్, రవీందర్, పర్వీన్బేగం పాల్గొన్నారు.
అమ్రాబాద్, జనవరి 25 : ఫారెస్ట్ వాచర్పై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఆదివారం చోటుచేసుకుంది. రేంజర్ వీరేశం తెలిపిన వివరాల ప్రకారం ఏటీఆర్లో ఈనెల 20 నుంచి కొనసాగుతున్న జంతు గణనలో భాగంగా మండలంలోని కొల్లంపెంట గ్రామానికి చెందిన వాచర్ ఉడుతనూరి సాయిలు ఆదివారం మండలంలోని తుర్కపల్లి ఫారెస్ట్ బీట్లో పులుల గణన లెక్కింపులో విధు లు నిర్వహిస్తుండగా అతనిపై ఎలుగుబంటి దాడి చేసింద ని ఆయన తెలిపారు. ఈ దాడిలో చేతులకు స్వల్ప గాయాలతో వాచర్ బయటపడ్డాడని వాచర్ను అమ్రాబాద్ దవాఖానకు తరలించి చికిత్సలు చేయించినట్లు చెప్పారు.