ఆత్మకూర్ : మండలంలోని పిన్నెంచెర్ల గ్రామంలో అభయ ఆంజనేయస్వామి (Abhaya Anjaneya Swamy) ఆలయ పునర్నిర్మాణానికి ( Temple renovation) ఆత్మకూరు మాజీ ఎంపీపీ శ్రీనివాసులు ( Srinivasulu ) రూ.3 లక్షల విరాళాన్ని అందజేశారని ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిన్నంచర్ల గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం చేపట్టేందుకు విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు.
భక్తులు కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారని వివరించారు. గ్రామస్తులంతా తమవంతుగా ఆలయ పునర్నిర్మాణానికి చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బసయ్య శెట్టి, శ్రీనివాసులు శెట్టి, గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి మచ్చెందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అజ్యపాగ మాసన్న , మనోహర్ గౌడ్, అశోక్ భూపాల్, కురువ నరసింహ, బోయ రాములు తదితరులు ఉన్నారు.