అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలని కలెక్టర్ సంతోష్‌ను గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి విన్నవించారు.
- కలెక్టర్‌కు విన్నవించిన గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
గద్వాల, జూన్ 6 : గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలని కలెక్టర్ సంతోష్‌ను గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి విన్నవించారు. గురువారం వారు కలెక్టర్‌ను కలిసి గద్వాల,అలంపూర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న, నిలిచిపోయిన అభివృద్ధి పనులపై చర్చించారు. త్వరలో పాఠశాలలు ప్రా రంభం అవుతున్నందున విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పు స్తకాలు, దుస్తులు అందించాలని కోరారు.
వర్షాకాలం ప్రా రంభమవుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో కొన్నింటికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం క ల్పించాలన్నారు. గ్రామాల్లో సర్పంచులు లేనందువల్ల ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుందని, పారిశుధ్య పనులు చేపట్టి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో గద్వాల నియోజకవర్గంలో చేపట్టిన వివిధ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు పూ ర్తయ్యే విధంగా ప్రత్యేక నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేలా చూడాలన్నారు. అందుకు కలెక్టర్ స్పందిస్తూ ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయో గుర్తించి ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

