మక్తల్ టౌన్, డిసెంబర్ 29 : సమాజంలో పోలీస్ విధులు అత్యంత బాధ్యతా యుతమైనవని, ప్రతి ఉద్యోగి అంకితభావంతో పని చేసినప్పుడే విధులకు సార్థకత లభిస్తుందని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. స్థా నిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఎస్పీ రికార్డుల పరిశీలన, పరిసరాల తనిఖీ చేశా రు. సీఐ సీతయ్య ఆధ్వర్యంలో సిబ్బంది గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం ప లికారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది పరేడ్, యూనిఫాం, నిట్టర్న్, ఔట్‌ను ఎస్పీ పరిశీలించారు.
పట్టణంలోపాత సీసీ కెమెరాలతోపాటు, హై క్వాలిటీతో నూతంగా ఏర్పాటు చే సిన 24 సీసీ కెమెరాలను ప్రారంభించి, పెండింగ్ కేసులను ఎస్సై, సీఐని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కేసుల్లో జాప్యం లేకుండా నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం లో ప్రవేశపెట్టాలన్నారు. ప్రతి ఉద్యోగి అప్రమత్తం గా ఉండి చోరీల నిర్మూలన కోసం అనుమానిత వ్యక్తులు ఎప్పుడు కనిపించిన వెంటనే తనిఖీ చే యాలన్నారు. డంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. స్టేషన్లో రికార్డులు సక్రమంగా ఉండడంతో సీఐ, ఎ స్సైలను ఎస్పీ అభినందించారు.
సీఐకి అభినందనలు
ఈనెల 10న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సమాజ సేవ పురస్కార్ 200 2 అవార్డు వచ్చినందు వల్ల ఎస్పీ వెంకటేశ్వర్లు సీ ఐ సీతయ్యను అభినందించి మెమోంటో, ప్రశం సాపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐ సీత య్య, ఎస్సైలు పర్వతాలు, రాములు, నరేందర్, విజయభాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.