బియ్యం లారీ పట్టివేత
బియ్యం లారీ పట్టుబడిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ కథనం మేరకు.. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం సోలీపూర్ గ్రామంలోని ఓ రైస్ ఇండస్ట్రీ నుంచి కర్ణాటకలోని రాయిచూర్‌కు 150 క్వింటాళ్ల బియ్యంతో లారీ వెళ్తున్నదన్న సమాచారం పోలీసులకు అందింది.
మాగనూరు, మార్చి 21 : బియ్యం లారీ పట్టుబడిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ కథనం మేరకు.. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం సోలీపూర్ గ్రామంలోని ఓ రైస్ ఇండస్ట్రీ నుంచి కర్ణాటకలోని రాయిచూర్‌కు 150 క్వింటాళ్ల బియ్యంతో లారీ వెళ్తున్నదన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే అప్రమత్తమైన వారు మాగనూరు పోలీస్‌స్టేషన్ ఎదురుగా బుధవారం రాత్రి వాహనాన్ని పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. బియ్యంపై అనుమానం ఉండడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గురువారం డీటీ కాలప్ప పరిశీలించారు. బియ్యం శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేస్తామని డీటీ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

