వనపర్తి, జూన్ 6 : పీర్ల గుట్టతోపాటు పలు చోట్ల కట్టించిన డబుల్ బెడ్రూం సమస్యలను అధికారులు పరిష్కరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పీర్లగుట్ట వద్ద ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి ప్రజలు వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేసీఆర్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు గూడు కల్పించాలన్న ఆలోచనతో వారి కోసం డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించినట్లు గుర్తు చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో తాము ప్రజల కు అందించిన డబుల్ బెడ్రూం కాలనీల్లో పూర్తి స్థాయిలో వసతుల కల్పన చేపట్టలేక పోయామని, కలెక్టర్, మున్సిపల్ అధికారులు కల్పించుకొని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యుత్, రోడ్డు, వీధి దీపాలు, తాగునీటి సరఫరాతోపాటు సీసీ రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. మాజీ మంత్రిని కలిసిన వారిలో కాలనీవాసులు నాగమ్మ, సుజాత, అరుణ, షానవాజ్, రమేశ్ తదితరులు ఉన్నారు.