అలంపూర్, జనవరి 2 : రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తం కావాలని జగజ్జనని జోగుళాంబ మాత ను వేడుకున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సో మవారం అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంత్రి తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీనివాసరెడ్డి అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారి ఆలయంలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో అర్చనలు చేశారు. అనంతరం అర్చకులు శేషవస్ర్తాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పథకా లు దేశవ్యాప్తంగా అమలయ్యేలా సీఎం కేసీఆర్కు శక్తి ప్రసాదించాలని వేడుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సా యం లేకుండానే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు సగర్వంగా తలెత్తుకొని బతుకుతున్నారన్నారు. దేశం లో రాజ్యాధికారం కోసం ధైర్యంగా ముందడుగు వేస్తున్న సీఎం కేసీఆర్కు మరింత మనోధైర్యం కలిగేలా అమ్మవా రు నిండు మనస్సుతో దీవించాలని కోరుకున్నానన్నారు.
దేశంలోని మిగతా రాష్ర్టా ల ప్రజలు ఇక్కడి పాలనను చూసి తమ వద్ద కూడా పథకాలు అమలయ్యేలా అక్కడి నాయకులను డిమాండ్ చేస్తున్నారన్నారు. దేశంలోని సహజ వనరులను వినియోగించుకోలేని స్థితిలో నేడు కేంద ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. దేశంలో లక్షల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నా కేంద్రం పట్టించుకునే స్థాయిలో లేదన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వనరులను సరైన రీతిలో వినియోగించుకొని రైతుల అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. రాష్ట్రంలో రై తులకు 24 గంటల ఉచిత విద్యుత్ అం దిస్తుంటే.. ఢిల్లీ నడిబొడ్డున కరెంట్ కోత లు ఉన్నాయని మండిపడ్డారు. ప్రాంతీ య ప్రజల అవసరాలు తెలుసుకున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. మంత్రి వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు, అధికారులు ఉన్నారు.