గద్వాల : గద్వాల మున్సిపల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వమేనని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ( Basu Hanmuanth Naidu,) పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో కూడా గద్వాల మున్సిపల్ పై గులాబీ జెండా ఎగిరేలా శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం పట్టణంలోని 18,19 వ వార్డులలో వార్డుల అభ్యర్థులు ఎర్రమట్టి కృష్ణయ్య, యం.దుర్గ టెంకాయల చంటితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.