నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 9 : కక్షిదారులు కేసుల పరిష్కారం కోసం రాజీమార్గం ఎన్నుకొని సత్వరం పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేశ్‌బాబు పేర్కొన్నారు. జిల్లా న్యాయాధికార సంస్థ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు ఆధ్వర్యంలో మూడు బెంచీలు అయిన కల్వకుర్తి, కొల్లాపూ ర్, అచ్చంపేట కోర్టులలో 11న నిర్వహించనున్న లోక్ అదాలత్ కార్యక్రమంపై గురువారం న్యాయశాఖ, పోలీస్‌శాఖ, ఉన్నతాధికారులకు కోర్టు ప్రాంగణంలో స మీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలోని కో ర్టులను నేటికీ పరిష్కరించబడకుండా 7,390 కేసులు ఉన్నాయని, చాలా కాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్య లు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం లోక్ అదాలత్ కార్యక్రమం ని ర్వహిస్తున్నట్లు తెలిపారు.
కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించబోయే లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజకీయ, ఆమోదయోగమైన సివిల్, క్రిమినల్, మోటర్ ప్ర మాద, కుటుంబ వివాద తదితర కేసులను పరిష్కరించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాజీ కుదుర్చుకునేందుకు 2,400 కేసులు సిద్ధంగా ఉన్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు. అయితే కేసులో సం బంధించి కక్షిదారులు కోర్టుకు వచ్చేలా పోలీస్‌శాఖ సం పూర్ణ సహకారంతో సాధ్యమవుతుందన్నారు. దీనికో సం తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన పోలీస్ ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. దీనిపై ప్రతినెలా సమీక్షా స మావేశం నిర్వహిస్తూ త్వరగా కేసుల పరిష్కారం కోసం కృషి చేసేలా పోలీస్, న్యాయశాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు లోక్ అదాలత్ కా ర్యక్రమంలో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు పోలీ స్ అధికారులు శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు.