అయిజ, జూలై 3 : అయిజ పట్టణంలోని మాలపేటలో ఈ నెల 1న జరిగిన జరిగిన హ త్య కేసు మిస్టరీ వీడింది. పోలీసులు పక్కా ఆధారాలతో రెండు రోజుల్లోనే కేసు మిస్టరీని ఛేదించి నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. మృతురాలి వ్యవహార శైలి, ప్రవర్తన, నడవడిక నచ్చకనే భర్త, కుమారుడు కలి సి వడ్ల సరోజ (40)ను హత్య చేశారని డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. గురువారం అయి జ పోలీస్ స్టేషన్లో సీఐ టాటాబాబు, ఎస్సై శ్రీనివాసరావులతో కలిసి డీఎస్పీ విలేకరుల స మావేశం నిర్వహించారు. ధరూర్‌కు చెందిన వడ్ల రామాచారి అయిజకు చెందిన సరోజను 2001లో వివాహం చేసుకున్నారు.
2009 వరకు వారి దాంపత్య జీవితం సాగింది. అప్పట్లోనే వారికి ఇద్దరు మగ సం తానం జన్మించారు. ఇదిలా ఉండగా, మృతురాలి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త రామాచారి ప లుమార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. దీంతో ధరూర్ పోలీస్ స్టేషన్లో మృతురాలు భర్తపై కేసు పెట్టి జైలుకు పంపిం ది. పెద్దల సమక్షంలో రాజీపడి సంసారం చేసుకుంటుంగా వారికి ఒక కూతురు జన్మిచింది. ముగ్గురు పిల్లులకు జన్మనిచ్చినా ఆమెలో ప్రవర్తన మారకపోవడంతో ఆమెను మందలించారు. దీంతో ఆమె ముగ్గురు పిల్లలతో అయిజకు చేరుకుని ఇక్కడే జీవిస్తోంది.
పెద్దల సమక్షంలో ఇద్దరు విడిపోయి, ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. ఈ క్రమంలో 2012 లో రా మాచారి కర్నూల్ జిల్లా, కోస్గికి చెందిన సుజాతను రెండో వి వాహం చేసుకొని అక్కడే ఉం టూ, అప్పుడప్పుడూ పిల్లలను చూసి వెళ్లేవాడని డీఎస్పీ తెలిపారు. ఆమె ప్రవర్తన కారణంగా పిల్లలకు సంబంధాలు రావడం లేదనే కారణంతో మంగళవారం కోస్గి నుంచి వచ్చిన రామాచారి తన కుమారుడు వినోద్‌తో కలిసి మృతురాలితో గొడవపడి ఆమె తలను గొడకు కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోగా అ క్కడి నుంచి జారుకుని కోస్గికి వెళ్లారని పేర్కొన్నారు.
ఇంటికి వచ్చిన చిన్న కుమారుడు తల్లి పరిస్థితిని గమనించి, తన మేనమామకు విష యం తెలుపగా దవాఖానకు తరలించగా ఆమె అప్పటికే మృతి చెందందని వైద్యులు వెల్లడించారు. మృతురాలి తమ్ముడు వడ్ల నర్సింహాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకు న్న ఎస్సై శ్రీనివాసరావు, శాంతినగర్ సీఐ టా టాబాబులు కేసును పరిశోధన చేశారని తెలిపారు.
ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మొగిలయ్య పర్యవేక్షణలో సీఐ టాటాబాబు, ఎస్సై శ్రీనివాసరావులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. గురువారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని శాంతినగర్ సర్కి ల్ కార్యాలయంలో విచారణ చేయగా, నిందితులు సరోజను హత్య చేసినట్లు ఒప్పుకున్న ట్లు తెలిపారు. ఇద్దరి నిందితులను గద్వాలలోని జడ్జి ఎదుట హాజరు పర్చి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.