లింగాల, మే 20 : నవమాసాలు మోసి జన్మనిచ్చి తల్లి కన్నకూతురిపై కర్కశంగా వ్యవహరించి నీటి సంపులో పడేసి హతమార్చిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెన్నంపల్లి గ్రా మానికి చెందిన మేకల రాములు, ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
రెండో కూతు రు అయిన మేకల నవిత (6)ను గాఢనిద్రలో ఉండగా తల్లి ఎల్లమ్మ ఎత్తుకొని వెళ్లి ఇంటి పక్కనే ఉన్న బొగ్గుల తిరుపతయ్యకు చెందిన నీటి సంపులో పడేసింది. గమనించిన బాలిక చిన్నాన్న సంపులో నుంచి చిన్నారిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మేకల ఎల్ల మ్మ గత ఐదు నెలల కిందట భర్త మేకల రాములును గొడ్డలితో నరికి హత్య చేసి జైలుకు వెళ్లిందని, ఆమె రెండు నెలల కిం దట బెయిల్పై బయటకు వచ్చినట్లు చెప్పారు.
అత్తా మామలు కేసు పెట్టి జైలుకు పంపారని ప్రతి రోజూ శాపనార్థాలు పెడుతుండేదని, ఈ విషయాలన్నీ మేకల నవిత నానమ్మ, చిన్నాన్నలకు చాడీలు చెబుతుందన్న కోపంతో కూతురును నీటి సంపులో పడవేసి హతమార్చిందన్నారు. మృతురాలు నానమ్మ మాసమ్మ ఫిర్యా దు మేరకు అచ్చంపేట సీఐ రవీందర్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.