మాగనూరు, జనవరి 4 : సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నది. చదువుకునేందుకు గ్రామాల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లడానికి తగినన్ని బస్సులు లేక విద్యార్థులు పడరానిపాట్లు పడుతున్నారు. కొంతమంది కాలినడకన, సైకిళ్లపై కిలోమీటర్ల దూరం వెళ్లి వస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా ఆటోల్లో కికిరిసి ప్రయాణం చేస్తున్నారు.
ప్రధాన రహదారిపై ఉన్న గ్రామాలకు తప్పా మిగతా మారుమూల పల్లెలకు పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి బస్సులు నడపడం లేద ని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆయా రూట్లలో కూడా సమయానికి బస్సులు రాక.. వచ్చినా వి ద్యార్థులు, మహిళలను చూసి బస్సులు ఆపకుం డా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా మాగనూరు మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ కళాశాల కు మండలంలోని కొత్తపల్లి, తాళంకేరి, గురురావులింగంపల్లి, వరూర్ గ్రామాల నుంచి దాదాపు 400పైనే విద్యార్థులు నిత్యం రూ.50 నుంచి రూ.100 ప్రై వేట్ వాహనాలకు ఖర్చు చేయాల్సి వస్తుందని వి ద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మారుమూల గ్రామాల విద్యార్థుల కో సం బస్సులు నడిపించాలని వారు కోరుతున్నారు.