వనపర్తి, జూలై 7 : వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని చిమనగుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తూర్పుతండా ఉన్నది. ఈ తండాకు ఇప్పటి వర కు రోడ్డు సౌకర్యం లేదు. తండావాసులు తమ పిల్లలను చదివించాలంటే ప్రాథమిక పాఠశాల కూడా లేదు. కనీసం ఓనమాలు నేర్పించడంతోపాటు బడి అలవాటు అయ్యేందుకు అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పా టు చేయలేదు. దీంతో గిరిజనులు తమ పిల్లలను చదివించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి నుంచి ఉన్నత విద్యను అభ్యసించే దాదాపు 50 మంది విద్యార్థులు ప్రతి రోజూ మూడు కిలో మీటర్లు రోడ్డు వరకు నడిచి వచ్చి సమీప గ్రామాల్లోని పాఠశాలలు, కళాశాలలకు బస్సులు, ఆటోల్లో వెళ్తున్నారు. అయితే కొద్ది మంది తండావాసులు తమ పిల్లలకు చదువు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ఆటోలు, వాహనాలు ఏర్పాటు చే సుకొని పాఠశాలలకు పంపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. తమ గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేయాలని గ్రా మానికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తండావాసులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు మాత్రమే మాతండాకు వస్తారని వచ్చి హామీలివ్వడం తప్పా చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.