వనపర్తి, జూన్ 24 : స్వరాష్ట్ర పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి వీధిలో బులియన్ మర్చంట్ వ్యాపారులతో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు మోహనాచారి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్యామ్‌సుందర్ ఆచారి, వేణుఆచారితోపాటు బులియన్ మర్చంట్ వ్యాపారులు 100మంది బీఆర్ఎస్లో చేరారు.
వారందరికీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బులియన్ మర్చంట్ వ్యాపారుల కోసం కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని.. రెండు, మూడు నెలల్లో అందుకు సంబంధించి శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, బులియన్ మర్చంట్ వ్యాపారులు నారాయణదాసు కిట్టు, రమేశ్ ఆచారి, నవీన్ ఆచారి, గోపీనాథ్ ఆచారి, రాఘవాచారి, బాలకృష్ణ ఆచారి, రమేశ్ఆచారి, వెంకటేష్ ఆచారి, బ్రహ్మం ఆచారి, జగదీశ్వరాచారి, రాజు ఆచారి, ప్రకాశ్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.