మహబూబ్‌నగర్ పట్టణంలో నమ్మశక్యం కాని విధంగా అభివృద్ధి జరిగింది. నాటితో పోల్చితే అసలు ఇది పాలమూరేనా.. అన్నంతగా రూపురేఖలు మారిపోయాయి. క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన సొంత ఇలాఖాను ‘న భుతో.. న భవిష్యత్’ అన్న విధంగా తీర్చిదిద్దారు. ప్రగతిని పరుగులు పెట్టించి అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చారు. ఇప్పటికే కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, ట్యాంక్‌బండ్, శిల్పారామం, ఐటీ టవర్ నిర్మించగా.. ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి పను లు వేగంగా జరుగుతున్నాయి. దీనికి తోడు రూ.18 కోట్లతో చౌరస్తాలను సుందరీకరించారు. అబ్బురపరిచేలా వివిధ ఆకృతులతో కూడళ్లను తీర్చిదిద్దారు. నూతన శోభతో జంక్షన్ల అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఓవైపు డబుల్‌లేన్ రహదారులు తళుకులీనుతుండగా.. మరోవైపు జిగేల్.. జిగేల్ మంటూ సెంట్రల్ లైటింగ్ కాంతులు విరజిమ్ముతున్నాయి.
– మహబూబ్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 20
ఇప్పటికే క్లాక్‌టవర్ జంక్షన్‌ను సుందరంగా నిర్మించారు. రూ.1.68 కోట్లతో అభివృద్ధి చేశారు. మహాత్మాగాంధీ విగ్రహంతోపాటు చుట్టూ జాతీయ నాయకుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అన్ని వైపులా గడియారాలు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌వద్ద అంబేద్కర్ చౌరస్తాలో కులవృత్తులను ప్రతిబింబించేలా విగ్రహాలను ప్రతిష్టించారు. దీనికి రూ.1.40 కోట్లను వెచ్చించారు.
ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ కూడలిలో అభివృద్ధికి రూ.1.48 కోట్లను ఖర్చు పెట్టారు. చిన్నారులను ఆకట్టుకునేలా కప్ సాసర్ నిర్మించి నీటి తొట్టె ఫౌంటేన్‌గా తీర్చిదిద్దారు. పగలు, రాత్రిళ్లు టీ కప్పు నుంచి జలాలు పారుతున్నట్లు రంగురంగుల్లో చూపరులను ఆకర్షించేలా అద్భుత కట్టడం నిర్మించారు. ఇదే కూడలిలో సుభాష్ చంద్రబోస్, గౌతమ బుద్ధడి విగ్రహాల వద్ద నీటి ఫౌంటేన్ ఏర్పాటు చేసి మహబూబ్‌నగర్ నామ ఫలకం బోర్డు ఏర్పాటు చేశారు.
ఇరుకుగా ఎప్పుడు ట్రాఫిక్ సమస్యతో ఉండే తెలంగాణ చౌరస్తాను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో సువిశాలంగా విస్తరించారు. ఈ కూడలి అభివృద్ధికి రూ.1.45 కోట్లు ఖర్చుచేశారు. చౌరస్తా మధ్యలో బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం ఏర్పాటు చేసి చుట్టూ పచ్చదనంతో నింపారు. చూపరులను ఈ కూడలి ఆకట్టుకుంటున్నది. రాత్రిళ్లు ఇక్కడి రంగురంగుల విద్యుద్దీపాల వెలుతురుతో కూడలి తళుకులీనుతున్నది.
మెట్టుగడ్డ కూడలి అభివృద్ధికి సుమారు రూ.29 లక్షలు వెచ్చించి తీర్చిదిద్దారు. పట్టణానికి దిక్సూచీ అయిన పిల్లల మర్రిచెట్టు ఆకారం, హమారా మహబూబ్‌నగర్ నామఫలకం ఏర్పాటు చేసి సెల్ఫీ పాయింట్‌గా తీర్చిదిద్దారు. ఇక్కడ పర్యాటకులు ఫొటోలు దిగి వాట్సాప్ డీపీలుగా, సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు.
వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఉన్న వన్‌టౌన్ చౌరస్తా జంక్షన్లో గతంలో భారీ వాహనాలు మళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడేవి. నేడు జంక్షన్‌ను రూ.1.48 కోట్లతో విస్తరించి సుందరంగా తీర్చిదిద్దారు. గాంధీరోడ్ పాఠశాల వద్ద బొమ్మలు, పిల్లలమర్రి చెట్టు ఆకారాలతో ముస్తాబు చేశారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ప్రహరీ పొడవునా వీర సైనికులు, అమర పోలీసులు, త్రివిధ దళాల సైనికుల విగ్రహాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.
జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా పలు కూడళ్లను ఇప్పటికే అభివృద్ధి చేశారు. అశోక్ టాకీస్ చౌరస్తాను రూ.1.48 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. విగ్రహాలు ఏర్పాటు చేసి చుట్టూ గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. కూడళ్ల అభివృద్ధిలో భాగంగా సద్దలగుండు చౌరస్తాను రూ.25 లక్షలు, బండ్లగేరి చౌరస్తా రూ.8 లక్షలు, పాత డీఈవో కార్యాలయం చౌరస్తాను రూ.15 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దారు. పట్టణ జంక్షన్ల అభివృద్ధికి మొత్తం రూ.18 కోట్లు ఖర్చు చేసి సుందర పట్టణంగా తలపించేలా పనులు చేపట్టారు. మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
పాలమూరు-భూత్పూరు రహదారిపై నూతన కలెక్టరేట్ వద్ద పట్టణ ప్రగతి ఉట్టిపడేలా విగ్రహాలను తీర్చిదిద్దారు. అభివృద్ధి పథాన నగరం పరుగులు పెడుతున్నట్లు, ప్రజలు ప్రయోజకులుగా ఉన్నట్లు వీటిని నిర్మించారు. సందర్శకుల మనస్సును కట్టిపడేస్తున్నాయి.
మహబూబ్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 20 : మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని పలు కూడళ్లు నూతన శోభను సంతరించుకున్నాయి. చౌరస్తాలను సుందరంగా ఇప్పటికే తీర్చిదిద్దారు. రూ.18 కోట్ల వ్యయంతో చౌరస్తాల సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టారు. కొన్ని జంక్షన్లలో విగ్రహాలు, పట్టణ ప్రగతిని సూచించేలా.. అందమైన నిర్మాణాలు చేపట్టారు. పిస్తా హౌస్ నుంచి మొదలు వన్‌టౌన్ వరకు చౌరస్తాలను సుందర ఆకృతులతో ముస్తాబు చేశారు. తల్లీబిడ్డ, సీతాకోక చిలుక ఆకృతులతోపాటు హరితహారం ఉట్టిపడేలా మార్చారు. పాలకొండ బైపాస్ చౌరస్తాలో చేతిలోంచి గంగ ఉప్పొంగేలా హ్యాండ్ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. కొత్త కలెక్టరేట్ వద్ద పట్టణ ప్రగతి ఉట్టిపడేలా విగ్రహాలను నిర్మించారు.
గతంలో క్లాక్‌టవర్ వద్ద జాతీయ నేతల, అంబేద్కర్ చౌరస్తాలో కులవృత్తులను ప్రతిబింభించేలా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ కూడలిలో కప్‌సాసర్ ఏర్పాటు చేసి నీటితొట్టె ఫౌంటేన్, అదే కూడలిలో సుభాష్ చంద్రబోస్, గౌతమ బుద్ధడి విగ్రహాల నీటి ఫౌంటేన్ ఏర్పాటు చేసి మహబూబ్‌నగర్ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. మెట్టుగడ్డ కూడలిలో పిల్లల మర్రిచెట్టు ఆకారం, హమారా మహబూబ్‌నగర్ సెల్ఫీ పాయింట్‌ను మది కట్టిపడేసేలా తీర్చిదిద్దారు. సద్దలగుండు చౌరస్తా, బండ్లగేరి చౌరస్తా, డీఈవో చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తాలను ఇదే మాదిరిగా సొబగులు అద్దారు. దీంతో సందర్శకులు ఫొటోలు దిగుతూ వాట్సాప్ డీపీలు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కాగా పిస్తా హౌస్ బైపాస్ చౌరస్తా నుంచి పాలకొండ బైపాస్ చౌరస్తా వరకు రెండు వరుసల రోడ్డుతోపాటు పట్టణంలోని పలు రహదారులు తళుకులీనుతున్నాయి. రోడ్ల మధ్య డివైడర్లపై సెంట్రల్ లైటింగ్ జిగేల్ మంటూ కాంతులీనుతున్నాయి. క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో మహబూబ్‌నగర్ పట్టణం హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అలుపెరగకుండా పట్టణాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.
పాలకొండ సమీపంలోని బైపాస్ రోడ్డు చౌరస్తాలో నిర్మాణం ఆకట్టుకుంటున్నది. చేతిలోంచి జలాలు చిమ్మేలా ఏర్పాటు చేసిన హ్యాండ్ ఫౌంటేన్ అబ్బురపర్చుతున్నది. పక్షులు ఇక్కడి నీటిని తాగేందుకు వస్తున్నాయన్న భ్రమను కలిగించేలా నిర్మాణం చేపట్టారు.
గతంలో ప్రభుత్వం చేనేత మిత్ర పథకం ద్వారా రేషం కొనుగోలుపై 40శాతం సబ్సిడీ ఇచ్చేది. ఇందుకు సం బంధించి ప్రతి 45 రోజులకు ఒకసారి రా యితీ నిధులు విడుదల చేయాలి. ఇందుకు జీఎస్టీ బిల్లులు తీసుకరావాల్సి వచ్చేది. దీంతో చదువుకొలేని వారికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ విషయాన్ని కార్మికులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, స్పందించి సబ్సిడీని నేరుగా జియోట్యాగింగ్ కలిగిన కార్మికుడి ఖాతా ల్లో రూ.2వేలు, అనుబంధ కార్మికుల ఖాతాల్లో రూ.500 చొప్పున జమ చేస్తున్నది. కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
– మాధవి, వేదనగర్, జోగుళాంబ గద్వాల
జడ్చర్ల-మహబూబ్‌నగర్ జాతీయ రహదారి ఎస్వీఎస్ దవాఖాన సమీపంలోని పిస్తా హౌస్ వద్ద బైపాస్ రోడ్డులోని కూడలిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిమ చూపరులను ఆకట్టుకుంటున్నది. ప్రకృతిని పరిరక్షించాలనే ఉద్దేశంతో వృక్షం ఆకారంలో తల్లి తన చిన్నారిని లాలిస్తున్న ప్రతిమ స్థానికులను కట్టిపడేస్తున్నది. హరితహారంలో వృక్ష సంపదను పెంచాలన్న సంకేతాన్ని ఇచ్చేలా నిర్మాణం చేపట్టారు. మమతల ఒడిలో ప్రకృతి అందచందాలు రహదారికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీని చెంతనే సీతాకోక చిలుక ఆకాశంలో విహరిస్తున్నట్లుగా నిర్మాణం ఏర్పాటు చేశారు. ఈ రెండు ప్రతిమలు ఆ కూడలికి నూతన శోభను తీసుకొచ్చాయి.
పట్టణంలోని పలు రోడ్లను విస్తరించారు. రెండు వరుసల రహదారిగా అభివృద్ధి చేయడంతో ట్రాఫిక్ కష్టాలు తీరాయి. పిస్తా హౌస్ మొదలుకొని పాలకొండ బైపాస్ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో పెద్ద పెద్ద మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు వద్ద మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ ప్రవేశ ముఖ ద్వార ఆర్చీని నిర్మిస్తున్నారు.
మహబూబ్‌నగర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఇప్పటికే జంక్షన్లను ఏర్పాటు చేశాం. విగ్రహాలు, అపురూప చిత్రాలు, గ్రామీణ నేపథ్యం, పట్టణ ప్రగతి తదితర అభివృద్ధిని సూచించే విగ్రహాలు, చిత్రాలతో పట్టణ కూడళ్ల అందంగా ముస్తాబయ్యాయి. ప్రధాన రహదారితోపాటు బైపాస్‌లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. రెండు వరుసల దారి మధ్యలో మీడియన్ ప్లాంటేషన్ ద్యారా మొక్కలు నాటాం. త్వరలో చౌరస్తాల్లో ప్రధాన రహదారితోపాటు, పలు కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ మాదిరిగా పాలమూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం.
– శ్రీనివాస్ గౌడ్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖల మంత్రి
గతంలో వచ్చే సబ్సిడీ మాస్టర్ వీవర్స్ తీసుకునేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత మగ్గాలకు జియోట్యాగింగ్ ఏర్పాటు చేయడం వల్ల నిజమైన చేనేత కార్మికులను గుర్తించినైట్లెంది. గతంలో సబ్సిడీ కోసం ఎదురు చూసేటోళ్లం. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. సెప్టెంబర్ 1వ తేదీ నుండి నేరుగా జియోట్యాగింగ్ ఉన్న ప్రతి చేనేత కార్మికుడి ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా జమ చేయడం సంతోషంగా ఉన్నది.
– స్వాతి, రాఘవేంద్ర కాలనీ, జోగుళాంబ గద్వాల
జియోట్యాగింగ్ కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి చేనేత మిత్ర పథకం ద్వారా నూలు సబ్సిడీ కింద నేరుగా వారి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయడం హర్షణీయం. గతంలో సబ్సిడీ తెచ్చుకోవాలంటే అనేక ఇబ్బందులు పడేటోళ్లం. మధ్య దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. మంత్రి కేటీఆర్ సవరించి సబ్సిడీ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవడం హర్షణీయం.
– అనిత, వేదనగర్, జోగుళాంబ గద్వాల