మక్తల్ టౌన్, జూన్ 10 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే సంకల్పం తో ప్రభుత్వం ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడమే కాకుండా నోట్బుక్కులుఅందించేందుకు సిద్ధమైంది. వీటిని పంపిణీ చేసేందుకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఆయా ఎమ్మార్సీ కార్యాలయాలకు తరలించారు. నారాయణపేట జిల్లాలో 378 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అందులో 76 ఉన్న త పాఠశాలలు, 11 కస్తూర్బాగాంధీ వి ద్యాలయాలు, రెండు మోడల్ సూళ్లు కలిసి మొత్తం 36 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం మూడు లక్షల నోట్ పుస్తకాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోతో చిత్రీకరించి పంపిణీకి సిద్ధం చేసింది. ఈ నెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రా రంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఇప్పటికే విద్యార్థుల కోసం యూనిఫామ్స్, పాఠ్య, నోట్ పుస్తకాలను సిద్ధం చేశారు. ఆయా పాఠశాలల కు నోట్బుక్కులను పంపిణీ చేస్తున్నా రు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు అనేక మౌ లిక వసతులు కల్పించింది. అదే విధం గా పలు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ను కూడా ప్రవేశపెట్టడంతో చాలా గ్రా మాల్లో ప్రజలు ప్రభుత్వం అం దించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలను మాన్పించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించా రు. ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ పాఠశాలలు ప్రారంభం నాటికి అన్ని పాఠశాలలకు మౌలి క వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించింది. అదే వి ధంగా పాఠ్య, నోటు పుస్తకాలు కూడా ఉచితంగా అందించడానికి సిద్ధం చేసింది.
అన్ని మండలాలకు పంపిణీ చేస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం పాఠ్య, నోట్ పుస్తకాలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే జిల్లా కేంద్రానికి 3 లక్షల నోట్ పుస్తకాలు వచ్చాయి. వీటిని అన్ని మండలాలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ కూడా పాఠశాలలు తెరిచిన వెంటనే అందించేందుకు చర్యలు చేపట్టాం.
– విద్యాసాగర్, ఏఎంవో, నారాయణపేట