మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 9 : తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్సీహెచ్ఈ) ఆధ్వర్యంలో పాలమూరు విశ్వవిద్యాలయం తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (టీజీపీఈసెట్)-2025ను ఈ నెల 11వ తేదీ నుంచి పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహిస్తోందని పీయూ వైస్‌చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పీయూ అడ్మిన్ బిల్డింగ్ సమావేశ మందిరంలో పీయూ రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, సెట్ కన్వీనర్ దిలీప్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌చాన్స్‌లర్ మాట్లాడారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలకు మాత్రమే సెట్ల నిర్వహణ అరుదుగా లభిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 కళాశాలల్లో ప్రవేశాలకు గానూ ఈనెల 11వ తేదీ నుంచి 14వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్-2025 పీయూ క్యాంపస్‌లో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు వెల్లడించారు. బీపెడ్, డీఎడ్ కోర్సుల్లో ప్రవేశం కోసం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వివిధ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి హాజరు కానున్నారని తెలిపా రు. పూర్తి పారదర్శకంగా తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎం ట్రన్స్ టెస్టు (టీజీపీఈసెట్) నిర్వహించడంతో యూనివర్సిటీ ప్రతిష్ట మరింత పెరగనున్నదన్నా రు. ప్రభుత్వం రానున్న రో జుల్లో మరిన్ని సెట్ల నిర్వహణ బాధ్యతలు యూనివర్సిటీకి అప్పగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అ భ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య రమేశ్‌బాబు, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దిలీప్‌కుమార్, పీయూ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులు, పీయూ పీఆర్వో శేకుంటి రవికుమార్ పాల్గొన్నారు.