Marikal | మరికల్ : పదో తరగతి మిత్ర బృందం గొప్ప మనసు చాటుకుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. కష్టకాలంలో ఆర్థిక సాయం అందించిన ఆ మిత్ర బృందానికి స్నేహితుడి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మరికల్ గ్రామానికి చెందిన పి రాము అనారోగ్యంతో ఇటీవలే మరణించాడు. దీంతో రాము స్నేహితులు అతని కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. 1994-95 పదో తరగతి బ్యాచ్ మిత్ర బృందం ఆర్థిక సాయం కింద రూ. 22 వేలను రాము కుటుంబానికి అందించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవిష్యత్లో కూడా రాము కుటుంబానికి భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలిసి చదువుకున్న మిత్రుడు మా మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, రవి, కమల్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, సురేందర్, మధు గౌడ్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.