మహబూబ్‌నగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి); ‘పది’ ప్రశ్నాపత్రం బహిర్గతం చేయడంలో పాత్రధారుడు.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఇవేం పనులంటూ పలు ప్రాంతాల్లో బండి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కన్నెర్ర చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు యత్నించాడని మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, కృష్ణమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కమలం పార్టీ నుంచి అతడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక అభాసుపాలు చేయడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలోని వ్యక్తికి సైతం బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, నీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. విచారణ చేపట్టి నిందితులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. కాగా అచ్చంపేట పీఎస్‌లో బండిపై విద్యార్థుల తల్లిదండ్రులు చేశారు.
Bandisanjay Court