సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తూ ఇటీవల సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 92 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఇక రెగ్యులరైజ్ కానున్నారు. దీంతో వారి పదహారేండ్ల నిరీక్షణకు తెర పడింది. కాంట్రాక్ట్ విధానంలో నెలకు రూ.35వేల వేతనం వస్తుండగా, రెగ్యులరైజ్ కావడంతోపాటు హెచ్ఆర్ఏ తదితర సౌకర్యాలతో దాదాపు రూ.60వేల పైగా వేతనం పొందే అవకా శం ఉన్నది. దీంతో కాంట్రాక్టు ఉపాధ్యాయులు సంబురపడుతున్నారు. 12 నెలలపాటు జీతం అందనుండడంతో ఉద్యోగులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 1 : విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందిస్తూ ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. అలాగే గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సైతం సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఉమ్మడి రాష్ట్రంలో అరకొరగా ఇచ్చే వేతనాలతోపాటు వేసవిలో జీతాలు రాక కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఎన్నో అవస్థలకు గురయ్యేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేతనాలు అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 92 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఇక రెగ్యులరైజ్ కానున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి జిల్లాలో మొత్తం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 16 ఉండగా, వీటిలో 6 బాలుర, 10 బాలికల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు 92 మంది విధులు నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు గురుకులాలు ఎంతో దోహదపడుతున్నాయి. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందుతుండడంతో తల్లిదండ్రులు గురుకులాల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సీఎం కేసీఆర్ విద్యార్థులతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి సైతం పాటుపడుతున్నారు. యేండ్ల తరబడి ఎంతో మంది విద్యార్థులకు బంగారు బాటలు వేసిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమద్ధీకరించేందుకుగానూ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను ఆగస్టు 25వ తేదీన ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం వీరికి కాంట్రాక్టు విధానంలో నెలకు రూ.35వేల వేతనం వస్తుండగా, రెగ్యులరైజ్ కావడంతోపాటు హెచ్ఆర్ఏ తదితర సౌకర్యాలతో దాదాపు రూ.60వేలకు పైగా వేతనం అందే అవకాశం ఉన్నది. దీంతో కాంట్రాక్టు ఉపాధ్యాయులు సంబుర పడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వేసవిలో జీతాలు కట్..
ఉమ్మడి రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు వేసవి కాలంలో రెండు నెలలపాటు వేత నం ఇచ్చేవారు కాదు. తెలంగాణ ప్రభుత్వం వ చ్చాక కాంట్రాక్టు ఉపాధ్యాయులకు వేసవిలోనూ వేతనం అందించి అండగా నిలిచింది. అంతేకాకుండా ప్రస్తుతం రెగ్యులర్ చేసి ఉద్యోగుల సంక్షేమంపై సీఎం కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి మరోసారి నిరూపించుకున్నా రు. ఈ సందర్భంగా రెగ్యులర్ అయిన ఉద్యోగులు హ ర్షం వ్యక్తం చేస్తూ తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం సారుకు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.
మాటల్లో చెప్పలే ని సంతోషం..
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉద్యోగిగా 16 ఏండ్ల నుంచి పనిచేస్తున్నా. విధి నిర్వహణలో ఎన్నో ఆర్థికపరమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. ఇక మమల్ని ఎవరూ పట్టించుకోరని నిరాశ చెందాం. మా బాధను తెలుసుకున్న సీఎం కేసీఆర్ రెగ్యులరైజ్ చేయడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– కవిత, కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, బాలానగర్
ఉమ్మడి రాష్ట్రంలో వేతనాలు ఇయ్యలే..
తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మాకు గుర్తింపు దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో వేసవిలో వేతనం ఇచ్చేవారు కాదు. పాఠశాల నిర్వహణలో ఇచ్చే అరకొర వేతనంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటోళ్లం. వేసవి అనంతరం తిరిగి పాఠశాలలు తెరిస్తే మా ఉద్యోగాలు ఉంటాయో లేదోనని ఆందోళన నెలకొనేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మా ఉద్యోగాలకు భరోసా కల్పించారు. రెగ్యులర్గా వేతనాలు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. సీఎం కేసీఆర్ మేలును ఎప్పటికీ మర్చిపోలేం.
– చంద్రకళ, గురుకుల కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలు