ఊట్కూర్ : ఉపాధ్యాయ జీవితం (Teachers Life) ఆదర్శప్రాయమైనదని కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కుసుమ కుమారి, తపస్ ( Tapas ) మండల అధ్యక్షుడు కృష్ణ, పీఆర్టీయూ ( PRTU ) మండల అధ్యక్షుడు గోవర్ధన్ అన్నారు. మండల విద్యాధికారి రామచంద్రచారి( Ramachandra Chari) పదవీ విరమణ కార్యక్రమం శనివారం స్థానిక ఎమ్మార్సీలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యాధికారిగా పనిచేసిన రాంచంద్రాచారి అనతి కాలంలోనే మండలంలో అత్యున్నత విద్య ప్రమాణాలతో, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. పదవీ విరమణ పొందిన ఎంఈవో శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో వివిధ పాఠశాలల హెచ్ఎంలు మాధవి , అనురాధ, నర్సింగప్ప , గురునాథ్, జగదీష్ కుమార్, తపస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్, పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, సీఆర్పీలు పాల్గొన్నారు.