మాగనూరు : మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి ( Election staff ) అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని తపస్ ( Tapas ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేర్ కృష్ణారెడ్డి , నరసింహ జిల్లా పరిషత్ సీఈవోకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత సిబ్బంది సొంత గ్రామాలకు వెళ్లే విధంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరారు .
ఎన్నికల సంఘం నిర్దేశించిన రెమ్యూనరేషన్ అందించాలని, పసి పిల్లలు ఉన్న తల్లులకు, అనారోగ్యంతో ఉన్న వారికి, , అత్యవసరమున్న ఉపాధ్యాయులకు, రెండు విడతలు ఎన్నికలు కేటాయించబడ్డ మహిళా ఉపాధ్యాయులను మూడో విడతకు మినాహాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు నర్సింలు, అధ్యక్ష, కార్యదర్శులు
రవీందర్, రాకేష్, మోహన్ రావు సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, సురేష్, తదితరులు
పాల్గొన్నారు.