జనగణన సర్వేలో ఓపెన్ ఇష్యూ..
వనపర్తి జిల్లాలో 2027 జనగణన సర్వే కొనసాగుతోంది. మే 11న ప్రారంభమైన ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా అధికారులు గడువులోపు సర్వేను పూర్తి చేయాలని పురమాయిస్తున్నారు.
- జిల్లాలో మరుగుదొడ్డి అంశంపై మల్లగుల్లాలు
- వివాదాస్పద ఆప్షన్‌ను మార్చాలంటూ ఒత్తిళ్లు
- ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఎన్యూమరేటర్లు
- ఫోన్లు చేస్తున్న సూపర్వైజర్లు, టెక్నీషియన్లు
- లేదంటే తాసీల్దార్ రమ్మన్నారంటూ పిలుపు
- వనపర్తి జిల్లాలో 34 అంశాలతో సర్వే
వనపర్తి, మే 29 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో 2027 జనగణన సర్వే కొనసాగుతోంది. మే 11న ప్రారంభమైన ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా అధికారులు గడువులోపు సర్వేను పూర్తి చేయాలని పురమాయిస్తున్నారు. ఇందులో ఎన్యూమరేటర్లుగా ఉపాధ్యాయు లు అధికంగా పాల్గొంటుండగా, చార్జ్ అధికారులు, అదనపు చార్జ్ అధికారులు, సూపర్వైజర్ల పర్యవేక్షణలతో నడుస్తున్న ఈ జనగణన పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలో కొనసాగుతున్నది.
34 అంశాలతో సర్వే..
ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలో 34 అంశాల వారీగా వివరాలు సేకరించాలి. కుటుంబ సభ్యుల సం ఖ్య, విద్య, ఉద్యోగం, ఇండ్లు, వలసలు, సామాజిక, ఆర్థికాలతోపాటు టాయిలెట్స్, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర అంశాలు ప్రాధాన్యతగా ఉన్నా యి. ప్రతిరోజు 20 ఇండ్ల వరకు ఒక ఎన్యూమరేటర్ గణన చేయగలిగితే సులభంగా పూర్తి చేసుకునేలా ప్రణాళిక ఉన్నది. ఇప్పటికే సర్వే మొదలై 16 రోజులు గడిచింది. ఇక మరో 18 రోజులుపాటు జనగణనకు వీలుంది. జిల్లాలో సర్వేను 13 వేల మంది సిబ్బందితో కొనసాగిస్తుండగా, వచ్చే నెల 9వ తేదీ వరకు పూర్తి చేయాలన్న లక్ష్యం ఉన్నది.
మరుగుదొడ్ల అంశంపైనే వివాదం
జనగణనలో ఉన్న 34 అంశాల్లో ఓ రెండు, మూడు అంశాల వారీగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ఒకే అంశంపై రెండు పర్యాయాలు పరిశీలన జరపాల్సి రావడం కూడా అదనపు భారంగా ఎన్యూమరేటర్లు పరిగణిస్తున్నారు. ఈ మేరకు కొన్ని చోట్ల ఎన్యూమరేటర్లు ఒత్తిళ్లకు లోనవుతున్నారు. సర్వేలో మరుగుదొడ్డి 20వ అంశంగా ఉంటే, ఇందు కు నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. ఇందులో 1) సొంత ంగా ఉంది. 2) సేరింగ్ 3)పబ్లిక్, 4)ఓపెన్ అని ఆప్ష న్లు ఉన్నాయి. అయితే గ్రామాల్లో మరుగుదొడ్డి లేదని, ఓపెన్‌కు వెళ్తున్నారని చాలా కుటుంబాల నుం చి ఎన్యూమరేటర్లకు సమాచారం వస్తుంది. అలాగే ఇదే మరుగుదొడ్డి అంశంపై జిల్లాలోని ఓ చోట చేసిన సర్వేలో దాదాపు 70 శాతంపైగా ఓపెన్ అని రావడం చర్చకు దారితీసినట్లు తెలిసింది.
మార్చాలంటూ ఒత్తిళ్లు..
జనగణనలో వివాదాస్పదమవుతున్న ఓపెన్ ఆప్షన్‌ను మార్చాలంటూ ఎన్యూమరేటర్లకు ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు సమాచారం. అయితే, ప్రధానంగా మరుగుదొడ్లు లేని కుటుంబాలు కూడా జిల్లాలో ఉండవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో ఓపెన్ అంటూ నమోదు కావడమే అధికారులకు అర్థం కావడం లేదు. నాలుగేండ్ల కిందట జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి వసతులు సమకూరాయన్న పరిస్థితిలో నేడు మళ్లీ ఓపెన్ అంటూ కుప్పలు.. తెప్పలు వస్తుండడం ఇరకాటంలో వేస్తుంది. ఈ సర్వేలో యజమానులు చెప్పిన సమాచారం మేరకు ఓపెన్ అనే ఆప్షన్‌ను ఎన్యూమరేటర్లు నమోదు చేస్తున్నారు. దీనిపైనే సూపర్వైజర్లు, తాసీల్దార్ కార్యాలయ టెక్నీషియన్ల ద్వారా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్యూమరేటర్లకు ఫోన్లు చేసి మరుగుదొడ్డి లేదని పెట్టిన వివరాలను తొలగించి సరిచేయాలని చెబుతున్నారు. ఒకవేళ చేయని పక్షంలో తాసీల్దార్ మిమ్మల్ని కలవమంటున్నారని టెక్నీషియన్ల ద్వారా ఎన్యూమరేటర్లను పురమాయిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరుగుడొడ్డి అం శంతోపాటు తాగునీటి వసతిపైన ఎన్యూమరేటర్లకు ఇరకాటం ఎదురవుతున్నట్లు సమాచారం.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

