లింగాల : జిల్లా యువజన , క్రీడల శాఖ ఆధ్వర్యంలో లింగాల( Lingala ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ శిక్షణ శిబిరం ( Kabaddi Camp ) శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా మత్స్యకారుల శాఖ ఏడీ రజిని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ క్రీడలు క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు .
క్రీడాకారునికి క్రమశిక్షణ అనేది ముఖ్యమని పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని అన్నారు, డీవైఎస్వో సీతారాం మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 10 శిబిరాలు ఏర్పాటుచేసి శిక్షణ తరగతులను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి , సలేశ్వరం బీజేపీ మండల అధ్యక్షుడు నవీన్, వాసవి క్లబ్ మండల అధ్యక్షుడు కొత్త రామకృష్ణ, మాజీ వార్డ్ సభ్యులు పూజారి సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందం పీడీ వసంత్ కుమార్, శిబిరం కోచ్ అబ్దుల్లా, సహాయ కోచ్లు కంప హరీష్ కుమార్, ప్యారం నవీన్ పాల్గొన్నారు.