కేశంపేట : అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ( Indiramma Houses ) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేశంపేట మండల పరిధిలోని సంతాపూర్ గ్రామ యువకులు ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డికి ( Ravichandrakumar Reddy) గురువారం వినతిపత్రం అందజేశారు. ‘ఇందిరమ్మ ఇల్లు ఇవ్వరూ’ ‘అర్హులకు దూరంగా ఇందిరమ్మ ఇండ్లు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో (Namaste Telangana) వరుసగా వచ్చిన కథనాలపై మండల యువకులు స్పందించారు. యువకుడు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని ఎంపీడీవో వినతిపత్రాన్ని అందజేశారు.
యువ నాయకుడు నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఎంపిక కమిటీలో కాంగ్రెస్ నేతలే ఉన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా తమ పార్టీ అనుయాయులను కమిటీ సభ్యులు ఎంపిక చేస్తున్నారన్నారు. ఇల్లు, భూమి, భర్తలేని నిరుపేదలనే కనికరం లేకుండా అనర్హులను ఎంపిక చేస్తున్నారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ ఫలాలు అందాల్సిన అవసరముందని అన్నారు. ఈ విషయమై అధికారులు పూర్తిస్థాయి శ్రద్ద పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.శ్రీనివాస్, శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, వీరేందర్‌నాయక్, జైపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.