పాలమూరు, ఫిబ్రవరి 13 : జేఈఈ ఫలితాల్లో రిషి కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాల్లో ఉత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను మంగళవారం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డాక్టర్ శ్రీధర్‌సుమన్ ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం కళాశాల డైరెక్టర్ చంద్రకళావెంకట్, అడ్వైజర్ వెంకటయ్య, డీన్ భూ పాల్‌రెడ్డి మాట్లాడుతూ జేఈఈలో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ పర్సంటైల్ సాధించి జిల్లా పేరును పతాక స్థాయిలో నిలబెట్టడం గర్వంగా ఉందన్నారు. ఈ ఫలితాల్లో రిషి కళాశాల విద్యార్థులు జి.సాకేత్సింగ్ 99.60 పర్సంటైల్, వై.వినయ్‌రెడ్డి 98.67, కె.వంశీచంద్ర 97.54 తోపాటు 16 మంది అత్యుత్తమ పర్సంటైల్ సాధించినట్లు వివరించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వారు అభినందించారు.