మహబూబ్‌నగర్ , ఆక్టోబర్ 24 : ప్రభుత్వ పాఠశాలలో చదవుకుంటున్న విద్యార్థులు పటాకులు కాల్చడంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలైన ఘటన శుక్రవారం ఉదయం మహ బూబ్‌నగర్ రూరల్ మండలంలోని రేగడిగడ్డతండా పం చాయతీలో శుక్రవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌రూరల్ మండలంలోని రేగ డిగడ్డతండా పంచాయతీ పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రాథమిక పాఠశాలకు వచ్చారు.
అయితే రెండో తరగతి విద్యార్థి అయిన సాయి దీపావళి పటాకులు కా ల్చుదాం రండి అంటూ విద్యార్థులను బయటకు తీసుకెళ్లాడు. పటాకుల్లో వంకాయ బాంబును వారికి చూయించి దానిలో ఉన్న పౌడర్లు మరో బాంబుపై పోసి కాల్చారు. దీంతో పక్కనే ఉన్న విద్యార్థినులు రుషిక, వసంత, మానసలపై పడడంతో వారి చేతులు కాలడంతో మొఖంపై మిరుగులు పడడంతో గాయాలయ్యాయి. వీరిని వెంటనే మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.